టర్కీపై మరోసారి ఉగ్రపంజా..

టర్కీపై మరోసారి ఉగ్రవాదులు పంజా విసిరారు. రాజధాని ఇస్తాంబుల్‌లో పోలీస్ బస్సును లక్ష్యంగా చేసుకుని కారు బాంబు పేల్చారు. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా, వారిలో ఏడుగురు పోలీసులున్నారు. మరో 36 మందికి తీవ్రగాయాలయ్యాయని..వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని ఇస్తాంబుల్ గవర్నర్ వసిప్ సాహిన్ ప్రకటించారు. పార్కింగ్ చేసి ఉన్న కారులో బాంబు పెట్టి రిమోట్ కంట్రోల్ సాయంతో పేల్చివేశారు. అయితే ఈ ప్రమాదానికి బాధ్యత వహిస్తూ ఇంత వరకు ఏ ఉగ్రవాద సంస్థ ముందుకు రాలేదు.