దినకరన్ కు మరో షాక్..
posted on Jun 8, 2017 4:32PM
.jpg)
అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ కు మరో షాక్ తగిలింది. ఎన్నికల పార్టీ గుర్తుకోసం ఈసీ అధికారులకు లంచం ఇవ్వజూపిన కేసులో ఇప్పటికే దినకరన్ ఆరోపణలు ఎదుర్కొంటుండగా... ఇప్పుడు మరో షాక్ తగిలింది. 2001లో ఈడీ ఆయనపై నమోదు చేసిన ఫెరా కేసు విచారణ నేపథ్యంలో ఆయన కోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా దినకరన్ పై నమోదైన అభియోగాలను జడ్జి వినిపించగా... దినకరన్ వాటిని ఖండించారు. అంతేకాదు దినకరన్ విన్నపాలను పట్టించుకోని జడ్జి... అభియోగాలను ఖరారు చేశారు. బార్క్లే బ్యాంక్ ద్వారా డిప్పర్ ఇన్వెస్ట్ మెంట్ కంపెనీకి అక్రమంగా తరలించిన 1.04 కోట్ల డాలర్లకు సంబంధించిన కేసులోని అభియోగాలను జడ్జి ఖరారు చేశారు. దీనికితోడు, 36.36 కోట్ల డాలర్లు, లక్ష పౌండ్ల ధనాన్ని యూకేలోని ఓ స్టార్ హోటల్ కు అక్రమ మార్గాల ద్వారా తరలించారనే కేసులో ఈ రోజు ఆయనపై కొత్త అభియోగాలు నమోదు చేశారు.