రాహుల్ గాంధీ అరెస్ట్..
posted on Jun 8, 2017 4:06PM
.jpg)
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్ లో రైతులు ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ ఉద్యమం ఉగ్రరూపం దాల్చింది. పోలీసు తుపాకుల తూటాలకు ఐదుగురు బలి కావడంపై రైతులు భగ్గుమంటున్నారు. ఇక వారికి మద్దతు తెలుపడానికి రాహుల్ గాంధీ అక్కడికి వచ్చారు. ఆ ప్రాంతంలో కర్ఫ్యూ విధించిన నేపథ్యంలో రాహుల్ పర్యటనకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. కానీ రాహుల్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా అక్కడికి వెళ్లడంతో అరెస్ట్ చేశారు. అయితే ఆయనను బలవంతంగా ఒక బస్సులోకి ఎక్కించి గుర్తుతెలియని అజ్ఞాత ప్రాంతంలోకి తీసుకెళ్లినట్టు సమాచారం. కాగా మంద్‌సౌర్‌లో జరిగిన కాల్పుల్లో ఐదుగురు రైతులు మృతిచెందిన సంగతి తెలిసిందే.