దడ పుట్టిస్తున్న దేశం దండు

తెలంగాణా ప్రాంతంలో జరుగుతున్నా అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ముందస్తుదాడి వ్యూహాన్ని అమలు చేస్తోంది. టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీకి మద్దతునిస్తున్న ప్రజాసంఘాలు ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను తరిమికొట్టాలని పిలుపునిచ్చాయి. అయితే అక్కడ పరిస్థితి ప్రస్తుతం రివర్సయింది. టిడిపి నాయకులు, కార్యకర్తలే చాలా చోట్లా టిఆర్ఎస్ నాయకులపై దాడులు జరుపుతున్నారు. శుక్రవారం నాడు టిఆర్ఎస్ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి వాహనాన్ని ధ్వంసంచేశారు.

 

గతంలో టిడిపి తెలంగాణా ప్రాంతంలో పలుచోట్లడిపాజిట్లు కోల్పోయింది. టిడిపి నాయకులు ప్రచారం చేయడానికి కూడా భయపడ్డారు. అయితే ఈసారి మాత్రం తెలుగుదేశం పార్టీ ముందస్తు వ్యూహాన్ని అమలుపరిచింది. తెలంగాణా జిల్లాలోని కేడర్ తో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా కేడర్ ను రప్పించింది. వీరు దేనికైనా సిద్ధపడేటట్లు చేసింది. వీరంతా పెద్ద దండులాగా గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. ఎవరైనా అభ్యంతరం చెబితే వారిపై విరుచుకుపడుతున్నారు. టిఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు జరపడానికి కూడా వీరు వెనుకాడటం లేదు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచార దండును చూసి టిఆర్ఎస్ కార్యకర్తలు భయపడే పరిస్థితి కొన్నిచోట్ల ఏర్పడింది. దీనికితోడు పోలీసులు కూడా ఎక్కడైనా టిఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనలకు దిగినా, ఇతరుల ప్రచారాన్ని అడ్డుకుంటున్నా వెంటనే స్పందించి వారిని తరిమి తరిమి కొడుతున్నారు. ఒకవైపు పోలీసులు, మరోవైపు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు టిఆర్ఎస్ మనోధైర్యాన్ని దెబ్బతీస్తున్నారు.

 

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu