కేంద్ర ప్రభుత్వ పెత్తనాన్ని సహించం..!

 

గవర్నర్‌కు ఉమ్మడి రాజధాని అధికారాలపై కేంద్ర ప్రభుత్వం పరిధి దాటి వ్యవహరిస్తోందని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్‌కు అధికారాలు ఇవ్వడం రాజకీయ కుట్ర... ఈ విషయంపై న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. కేంద్రం లేఖపై మిగితా రాష్ర్టాల సీఎంలను కలిసి చర్చిస్తామన్నారు.

 

తెలంగాణ సర్కారు పాలనను చూసి కేంద్రం ఓర్వలేకపోతుందనని ఎంపీ కడియం శ్రీహరి అన్నారు. అన్ని రాష్ర్టాల సీఎంలతో కలిసి కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. ప్రత్యేకాధికారాలపై అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు.



హైదరాబాద్‌పై కేంద్రం పెత్తనాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని డిప్యూటీ సీఎం రాజయ్య తేల్చిచెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేశారు. కేంద్రం నిరంకుశ నిర్ణయాలకు అడ్డుకట్ట వేస్తామని చెప్పారు. అవసరమైతే మరో పోరాటానికి సిద్ధమవుతామని పేర్కొన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu