పంట రుణాల రీ షెడ్యూల్ కు ఆర్.బీ.ఐ. అంగీకారం

 

గత రెండు నెలలుగా పంట రుణాల రీ షెడ్యూల్ పై రోజుకో మాట మాట్లాడుతున్న ఆర్.బీ.ఐ. ఆంద్ర ప్రదేశ్ లో నాలుగు జిల్లాలలో, తెలంగాణాలో మూడు జిల్లాలలో మాత్రమే పంట రుణాలను రీ షెడ్యూల్ చేసేందుకు అంగీకరించినట్లు తాజా సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా మరియు నెల్లూరు జిల్లాలలో రైతులు తీసుకొన్న రూ.5000 కోట్ల పంట రుణాలను రీ షెడ్యూల్ చేసేందుకు అంగీకరించినట్లు సమాచారం. అయితే బంగారు ఆభరణాలపై తీసుకొన్న రుణాలను మాత్రం రీ షెడ్యూల్ చేసేందుకు నిరాకరించింది. ఆర్.బీ.ఐ. తీరు చూసిన తరువాత ఇక దాని సహాయంపై ఆశలు వదిలేసుకొన్న ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇది కొంత ఉపశమనం ఇస్తుంది. ప్రభుత్వం గత రెండు నెలలలో వివిధ ఆదాయ మార్గాల ద్వారా ఇప్పటికే రూ.10,000 కోట్లు కూడబెట్టి దానిని రైతుల రుణమాఫీకి వినియోగించేందుకు పక్కన ఉంచింది. మరొకటి రెండు నెలలలో మరో రూ.10,000 కోట్లు కూడబెట్టగలమనే ధీమాతో ఉంది. ఇప్పుడు ఆర్.బీ.ఐ స్వయంగా 5000 కోట్లు రీ షెడ్యూల్ చేసేందుకు అంగీకరిస్తోంది గనుక త్వరలోనే ఈ రుణభారం నుండి బయటపడగాలనని ప్రభుత్వం ధీమాతో ఉంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu