బర్రెలక్కపై ట్రోలింగ్స్ 

గత బిఆర్ ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని ఆరోపిస్తూ బర్రెలక్క   గత ఎన్నికల్లో కొల్పాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు కాంగ్రెస్ అధికారంలో వచ్చాక నాగర్ కర్నూల్  పార్లమెంటు ఎన్నికల్లో కూడా పోటీ చేసి పరాజయం చెందిన  సంగతి తెలిసిందే.  పదేళ్ల తర్వాత గ్రూప్ 1 పరీక్షలు  జరుగుతున్నాయి. జీవో 29 రద్దు చేయాలని  నిరుద్యోగులు డిమాండ్ చేసిన నేపథ్యంలో  బర్రెలక్క సోషల్ మీడియాలో రీల్స్ చేస్తుంది. పార్ల మెంటు ఎన్నికల తర్వాత ఆమె వివాహం చేసుకుని సెటిలైపోయింది. తనను తాను ఝాన్సి , చాకలి ఐలమ్మ అని చెప్పుకున్న బర్రెలక్క గత అసెంబ్లీ ఎన్నికల్లో ఫేమస్ అయ్యారు. సెలబ్రీలు, ప్రముఖు వ్యక్తులు ఆమెకు సపోర్ట్ చేశారు. నిరుద్యోగుల కోసం ప్రాణాలర్పిస్తానని చెప్పుకున్న బర్రెలక్క అలియాస్ శిరీష ఇలా మోసం చేయడం పట్ల పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.