డ్రోన్ సమ్మిట్ ను ప్రారంభించిన చంద్రబాబు- డ్రోన్ హబ్ గా ఏపీ లక్ష్యమని ఉద్ఘాటన

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ది, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా   పాలన కొనసాగిస్తోంది. మరీ ముఖ్యంగా అమరావతి రాజధానికి ఐకానిక్ ట్రెడ్ మార్క్ తెచ్చేందుకు సీఎం చంద్రబాబునాయుడు  కంకణం కట్టుకున్నారు. సాంకేతికతను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే  భాగంగానే విజయవాడలో రెండు రోజుల పాటు జరిగే డ్రోన్ సమ్మిట్ కు ఆయన మంగళవారం (అక్టోబర్ 22)న ప్రారంభించారు.   విజయవాడలోని పున్నమి ఘాట్ దగ్గరున్న సీకే కన్వెన్షన్ లో జరుగుతున్న ఈ సమ్మి ట్ ను ఉద్దేశించి ప్రసంగించిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ను డ్రోన్ హబ్ గా మార్చడమే లక్ష్యమని పేర్కొన్నారు.  ఈ డ్రోన్  సమ్మిట్ ను విజయవంతం చేసే బాధ్యతను చంద్రబాబు సర్కార్ పది మంది ఐఏఎస్ లకు బాధ్యత అప్పగించింది. రెండ్రోజుల పాటు జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ డ్రోన్ సమ్మిట్ సందర్భంగా రాష్ట్ర డ్రోన్ ముసాయిదా విధానం ఆవిష్కరించే అవకాశం ఉంది.  

 ఈ సమ్మిట్ లో ఏపీ డ్రోన్ కార్పొరేషన్  డ్రోన్ పైలెట్ శిక్షణపై క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకోనుంది. అలాగే తిరుపతి ఐఐటీని నాలెడ్జ్ పార్టనర్ గా చేర్చుకుంటూ మరో ఒప్పందం కుదుర్చుకుంటుంది.  నవంబరు చివరి  నాటికి డ్రోన్ పాలసీకి తుది రూపునిస్తామని ఏపీ డ్రోన్ కార్పొరేన్ తెలిపింది. ఇలా ఉండగా మంగళవారం (అక్టోబర్ 21) సాయంత్రం విజయవాడ బెరం పార్కులో  దేశంలోనే అతి పెద్ద డ్రోన్ షో నిర్వహించనున్నారు.