ఉత్తరఖండ్ సీఎం ఫిక్స్.. రేపే ప్రమాణ స్వీకారం...

 

ఉత్తరఖండ్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని ఎంపిక మాత్రం ఇంతవరకూ జరగలేదు. కానీ ఉత్తరాఖండ్ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి రేసులో మాత్రం త్రివేంద్ర సింగ్ రావత్ పేరు మాత్రం ముందునుండి వినిపిస్తూనే ఉంది. ఎట్టకేలకు ఇప్పుడు ఆయననే ఖరారు చేస్తూ బీజేపీ నిర్ణయం తీసుకుంది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పదవికి సత్పాల్ మహరాజ్ లాంటి పేర్లు వినిపించినా, చివరకు త్రివేంద్ర సింగ్ రావత్‌ను ఖరారు చేశారు. దీంతో ఉత్తరఖండ్ ముఖ్యమంత్రిగా రావత్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu