యూపీ సీఎం ఎవరో రేపు చెబుతాం..

 

యూపీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకూ సీఎం ను ఎంపిక చేయడంలో మాత్రం ఇంకా కన్ఫ్యూజన్ లోనే ఉంది. అయితే ఈ విషయంపైనే ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు కేశ‌వ్ ప్ర‌సాద్ మౌర్యను అడగగా.. శ‌నివారం సాయంత్రం 4 గంట‌ల‌కు శాస‌న‌స‌భా ప‌క్ష స‌మావేశం ఉంటుందని.. ఎవ‌రు సీఎం అవుతారో అప్పుడే తెలుస్తుంది అని ఆయ‌న స్ప‌ష్టంచేశారు. సీఎం ఎంపిక మీకే అప్ప‌గించిన‌ట్లు అమిత్‌షా చెప్పారుగా అని ప్ర‌శ్నించ‌గా.. ఆయ‌న స‌ర‌దాగా అలా అన్నారని, అధ్యక్షుడిగా నేను ఏం చేయాలో అది చేస్తాన‌ని అన్నారు. కాగా నిన్న కేశ‌వ్ ప్ర‌సాద్ మౌర్య  స్వల్ప అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఆయనను ఢిల్లీలోని రాం మనోహర్ లోహియా ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu