పెళ్లికూతురౌతున్న త్రిష
posted on Nov 12, 2012 2:55PM

హీరోయిన్ త్రిష తొందర్లో పెళ్లి చేసుకోబోతోందట.. తెలుగు, తమిళ, కన్నడ సినీ రంగాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్.. ఎలాగూ సినిమా ఛాన్స్ లు బాగా తగ్గుతున్నాయ్ కాబట్టి ముఫ్పైల్లో ఉండగానే ఆ మూడుముళ్లూ వేయించుకుని ముచ్చట తీర్చుకుంటే బాగుంటుందని తల్లి ఉమా కృష్టన్ తెగ పోరుతున్నట్టు సమాచారం. ఆవిడ తెగ సీరియస్ గా సంబంధాలుకూడా వెతికేస్తోందట..
ఈ మాట విన్నదగ్గర్నుంచీ రానా కాస్త అప్ సెట్ అయినట్టు కనిపిస్తోందని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ మధ్య కాలంలో రానా, త్రిష చాలా క్లోజ్ గా రాసుకుపూసుకుని తిరుగుతూనే తమది ఫ్రెండ్ షిప్ మాత్రమే అంటూ బిల్డప్ ఇస్తున్నారని తెలుగు సినిమా ఇండస్ట్రీ కోడైకూస్తోంది.
త్రిష ఫాదర్ చనిపోయినప్పుడుకూడా రానానే అన్ని ఏర్పాట్లూ దగ్గరుండి చూసుకున్నాడు. అబ్బెబ్బే తనప్పుడు నాకు మోరల్ సపోర్ట్ గా నిలబడ్డాడంతే.. దానికి పెడర్ధాలు తీస్తారేంటి అంటూ వగలమారి త్రిష వయ్యారాలు పోతోందని కూడా చెప్పుకుంటున్నారు. విషయాన్ని వక్రీకరించకుండా పాజిటివ్ గా ఆలోచించాలని త్రిష అందరికీ విజ్ఞప్తికూడా చేసిందట. సో.. త్వరలోనే త్రిషని చేసుకోబోయే వాడెవడో తేలిపోబోతోందన్నమాట..