లడ్డూ కల్తీపై  సిట్ చీఫ్ గా  త్రిపాఠి నియామకం 

తిరుపతి లడ్డు కల్తీ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం స్పీడ్ పెంచింది. ఈ కేసును సిట్ కు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సిట్ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన సర్వశ్రేష్ట్ త్రిపాఠీ  గుంటూరు రేంజ్ ఐజీగా పని చేస్తున్నారు.  గత వైఎస్సార్ ప్రభుత్వ హాయంలో కల్తీ జరిగినట్లు ల్యాబ్ నివేదిక వెల్లడి కావడంతో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పవిత్ర తిరుపతి లడ్డూలో పంది కొవ్వు అవశేషాలు కనిపించడంతో వివాదం మరింత ముదిరింది. అన్యమతస్థులకు పగ్గాలు అప్పగించడం వల్లే ఈ అపచారం జరిగినట్టు తెలుస్తోంది. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. కల్తీ జరిగిన విషయాన్ని తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలకు వెల్లడించారు