బాండ్ల రుణం జమ.. డ్రగ్స్ తో ఏపీ పరువు గోవిందా.. బీజేపీ నేతకు చెప్పుదెబ్బ.. టాప్ న్యూస్ @ 1PM

సెక్యూరిటీ బాండ్ల వేలంతో ఏపీ ప్రభుత్వం తెచ్చిన రూ. 2వేల కోట్ల అప్పును ఆర్బీఐ ఓవర్ డ్రాఫ్ట్‌కు జమచేసుకుంది. ఇప్పటికే ఓడీ ఉండడంతో సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన అప్పును రిజర్వు బ్యాంక్ వెంటనే జమ చేసుకుంది. కేంద్రం అదనంగా ఇచ్చిన రూ. 10వేల 5వందల కోట్లలో రూ. 9వేల కోట్లను ఏపీ ప్రభుత్వం ఇప్పటికే వాడేసింది.
----
మాదకద్రవ్యాల కేసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరువు నష్టం జరిగిందని, అది ఇంకా దిగజారే ప్రమాదం ఉందని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు.దిగుమతి ఆంధ్రప్రదేశ్‌లో జరిగి ఉండక పోవచ్చు కానీ ఆఫ్ఘన్ నుంచి దిగిన హెరాయిన్ బుకింగ్ ఏక్కడ నుంచి జరిగిందన్నారు. ఆషి ట్రేడింగ్ ద్వారా హెరాయిన్ బుక్ చేశారని చెప్పిందే డీఆర్ఐ కదా అని అన్నారు. ఏన్‌ఐఏ బృందం
విజయవాడ వచ్చిందా? లేదా? అని దినకర్ ప్రశ్నించారు.
--------
ఏపీలో ఇసుక బంగారం కంటే ఖరీదైనదిగా మారిందని వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలోని ఇసుకను వందల కోట్లు, వేల కోట్లకు ప్రైవేట్ కంపెనీలకు అప్పగించారని... సామాన్యుడు ఇసుకను కొనలేక, ఇల్లు కట్టుకోలేని పరిస్థితిని తీసుకొచ్చారని అన్నారు. మద్యం ధరలను పెంచి, సామాన్యుడిని దోచుకుంటున్నారని, పేదల డబ్బుని
ఖజానాకు తరలిస్తున్నారని విమర్శించారు.
----
విజయవాడలో వలంటీర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. శానిటైజర్ తాగి వాలంటీర్ భవానీ ఆత్మహత్యకు పాల్పడింది. భర్త, అత్తింటివారి వేధింపులే కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కృష్ణలంక బాలాజీనగర్‌లో ఘటన చోటు చేసుకుంది.
---------
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌‌తో డీఎంకే నేతలు భేటీ అయ్యారు. నీట్ రద్దు చేయాలనే డిమాండ్‌కు మద్దతు ఇవ్వాలని పలువురు ముఖ్యమంత్రులకు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ రాశారు. తమిళనాడు సీఎం స్టాలిన్ రాసిన లేఖను కేటీఆర్‌కు  డీఎంకే ఎంపీలు  అందజేశారు. నీట్ ప్రవేశ పరీక్షను వ్యతిరేకిస్తూ 12 మంది సీఎంలకు స్టాలిన్ లేఖ రాశారు. 
------
తెలంగాణ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వి.హ‌నుమంతరావు హైద‌రాబాద్‌లోని త‌న నివాసం వ‌ద్ద మౌన దీక్ష‌కు దిగారు. ఇటీవ‌ల ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ల‌ఖింపూర్ ఖేరీలో జ‌రిగిన హింస‌లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న‌కు నిర‌స‌న‌గా వీహెచ్ దీక్ష‌కు దిగారు.కేంద్ర మంత్రి అజ‌య్ మిశ్రాను ఆ ప‌ద‌వి నుంచి తొల‌గించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. రైతుల మృతికి కార‌ణ‌మైనవారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న అన్నారు.
----
నిజామాబాద్‌లో బీజేపీ నేత వివాహేతర సంబంధం  వెలుగు చూసింది. గత రాత్రి తమ కూతురిని ఎత్తుకెళ్లిన బీజేపీ కార్పొరేటర్ భర్త ఆకుల శీనును అమ్మాయి తల్లిదండ్రులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తమ కూతురిని మోసం చేశాడంటూ వినాయక నగర్‌లోని ఆకుల శీను ఇంటిముందు బాధితులు ఆందోళనకు దిగారు. ఆకుల శీను ఇంటిపై దాడికి దిగారు.
---
ఇంద్రకీలాద్రిపై విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారిపై మంత్రి వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్శనానికి వెళుతున్న సమయంలో మంత్రి వెల్లంపల్లిని సీఐ గుర్తుపట్టలేదు. దీంతో ఏయ్ పక్కకు తొలుగు అంటూ  సీఐపై మంత్రి మండిపడ్డారు. అమ్మవారి దర్శనం చేసుకొని డీజీపీ గౌతమ్ సవాంగ్ వస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా మంత్రి తీరును
పోలీసులు తప్పుబడుతున్నారు. 
-------
దసరా శరన్నవరాత్రులు జరుగుతున్న ఇంద్రకీలాద్రిపై అపచారం చోటుచేసుకుంది. అమ్మవారికి సమర్పించేందుకు శ్రీకాళహస్తి నుండి ఆలయ సిబ్బంది సారే తీసుకువచ్చింది. అయితే సారేను అర్చకులు భక్తులు నడిచే నేలపై ఉంచారు. భక్తులు నడిచే మార్గంలో సారె, పూజా సామాగ్రి ఉంచడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
--------
కరోనా టీకాలు కొవిషీల్డ్, కొవాగ్జిన్ లకు బూస్టర్ డోసుగా ‘కార్బివాక్స్’ను అనే వాక్సిన్ ను హైదరాబాద్ ఫార్మా సంస్థ ‘బయోలాజికల్ ఈ’ అభివృద్ధి చేసింది. దీనికి అనుమతులు ఇవ్వాల్సిందిగా డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కు సంస్థ దరఖాస్తు చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కొవిషీల్డ్, కొవాగ్జిన్ లను రెండు డోసులుగా ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ
నేపథ్యంలోనే మూడో డోసుగా (బూస్టర్) కార్బివాక్స్ కు అనుమతులు ఇవ్వాల్సిందిగా సంస్థ కోరినట్టు అధికారులు చెబుతున్నారు.
---