కార్పొరేటర్ భర్తకు చెప్పు దెబ్బలు.. ఆమె కూతురితో వివాహేతర సంబంధం!
posted on Oct 13, 2021 12:19PM
ఆయనో రాజకీయ నేత. వృత్తి రాజకీయమే అయినా.. ప్రవృత్తి మాత్రం వేరే ఉంది. ఆయన ఆమె సేవలో తరిస్తున్నాడు. భార్యను కార్పొరేటర్‌గా గెలిపించుకొని.. తాను మాత్రం వలపు ఒడిలో సేదతీరుతున్నాడు. భార్య కార్పొరేషన్ సమావేశాలకు వెళ్తుంటే.. అతను మాత్రం వివాహేతర సంబంధాల వెంట తిరుగుతున్నాడు. అలా.. అలా.. బాగా ఎంజాయ్ చేస్తుంటే.. వన్ ఫైన్ నైట్ వాళ్ల బండారం బయటపడింది. కట్‌చేస్తే.. చెప్పు దెబ్బలతో సీన్ సితారా అయింది. పరువంతా పోయింది. తలెత్తుకోలేని దుస్థితి దాపురించింది.
నిజామాబాద్‌లో ఓ కార్పొరేటర్ భర్తని.. అతని ఇంటికి వెళ్లి మరీ చెప్పుతో కొట్టింది ఓ మహిళ. తన కూతురితో వివాహేతర సంబంధం పెట్టుకుని వాడుకుంటున్నాడంటూ ఆరోపిస్తూ.. చెడామడా బాదేసింది. వినాయకనగర్‌లోని కార్పొరేటర్ భర్త ఇంటి ముందు బాధితురాలి కుటుంబం ఆందోళనకు దిగింది. గతంలోనూ అతన్ని గట్టిగా మందలించినా.. ఆ కార్పొరేటర్ భర్త తీరు మారలేదంటూ ధర్నాకు దిగారు.
మంగళవారం రాత్రి తన కూతురిని ఎత్తుకెళ్లాడంటూ.. కార్పొరేటర్ భర్త ఆకుల శీను ఇంటిపై దాడి చేశారు. ఆకుల శీనును చెప్పుతో కొట్టారు. తమకు న్యాయం చేయాలంటూ శీను ఇంటి ముందు ఆందోళనకు దిగారు. అయితే, తమ కూతురుని తమకు అప్పగించాలంటూ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన నిజమాబాద్‌లో హల్‌చల్‌గా మారింది. కార్పొరేటర్ భర్త ఆకుల శీను యవ్వారం వివాదాస్సదమైంది.