తిరుపతి రేసులో దూసుకుపోతున్న వెంకటరమణ

తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయాలనుకుంటున్న మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ ఒకవైపు వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ మరోవైపు ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. కాని ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇంతవరకూ తమ అభ్యర్థిని ప్రకటించలేదు. ఈ టిక్కెట్టు కోసం మంత్రి గల్లా అరుణకుమారి తనయుడు గల్లా జయదేవ్ కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

అయితే వెంకటరమణ వ్యాహాత్మకంగా వ్యవహరించి సిఎం ,కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ, రాజ్యసభ సభ్యుడు చిరంజీవిల ఆశీస్సులు పొంది నట్లు తెలుస్తోంది. వారిచ్చిన భరోసాతోనే వెంకటరమణ ఎన్నికల ప్రచారం ప్రారంభించి నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేగా ఉంటూ 2009 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి అడ్డుపడి వెంకటరమణకు టిక్కెట్టు రాకుండా చేశారు. అప్పట్లో తిరుపతి టిక్కెట్టును కరుణాకర రెడ్డికి ఇప్పించిన వైఎస్, వెనకతరమణకు ఎమ్మెల్సీ లేదా నామినేటేడ్ పోస్టు ఇస్తానని వాగ్దానం చేశారు. కానీ ఈ వాగ్దానం నేరవేర్చకుండానే ఆయన మరణించటంతో వెంకటరమణ రాజేకీయ భవిష్యత్తు గందరగోళంలో పడింది. ఈ నేపథ్యంలో తిరుపతి అసెంబ్లీకి ఉప ఎన్నికలు రావడంతో వెంకతరనమకు మళ్ళీ కొత్త ఆశలు చిగురించాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu