కోట్లాది భక్తుల ముందే..శ్రీవారి సన్నిధిలో చిన్నారి కిడ్నాప్
posted on Jun 14, 2017 3:00PM

ఈగ కూడా లోపలికి రానంత సెక్యూరిటీ..కోట్లాది మంది భక్తులు..దేనినైనా క్షణంలో పసిగట్టే నిఘా కెమెరాలు ఇంత భద్రత ఉన్నా..సాక్షాత్తూ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుని సన్నిధిలోనే ఓ చిన్నారి కిడ్నాప్‌కు గురవ్వడం భక్తులను కలవరానికి గురిచేసింది. వివరాల్లోకి వెళితే వెంకన్న ఆలయం ఎదుట ఉన్న గొల్ల మండపం వద్ద తల్లిదండ్రుల పక్కనే నిద్రిస్తున్న ఏడాది వయసున్న చిన్నారిని గుర్తుతెలియని వ్యక్తి అపహరించాడు. తెల్లవారుజామున నిద్రలేచిన ఆ తల్లిదండ్రులకు తమ బిడ్డ పక్కన లేకపోవడంతో..అటు ఇటు వెతికారు. ఇక చేసేది లేక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించగా, అసలు నిజం వెలుగులోకి వచ్చింది. ఉదయం 5 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని దుండగుడు చిన్నారిని తీసుకువెళుతున్నట్లు సీసీ కెమెరాలో రికార్డయ్యింది. చిన్నారిని వెతికేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు పోలీసులు.