కంటతడి పెట్టిన గవర్నర్ నరసింహన్
posted on Jun 14, 2017 2:43PM
.jpg)
ఉద్వేగం చెట్టులాంటి మనిషిని కూడా పట్టు తప్పేలా చేస్తుందంటారు. ఆ ఉద్వేగం గుండెను తాకిందంటే అక్కడి బాధ కన్నీటి రూపంలో బయటకు రావాల్సిందే. ఎలాంటి వ్యక్తి అయినా సరే దానికి అతీతుడు కాదు. ఎవరెంతంగా కవ్వించినా..రెచ్చగొట్టినా ఎప్పుడు సహనంగా ఉండే తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కంటతడి పెట్టారు. అనారోగ్యంతో మరణించిన ప్రముఖ కవి, సినీ గేయ రచయిత డాక్టర్ సి.నారాయణరెడ్డికి నివాళుర్పించేందుకు గవర్నర్ ఆయన ఇంటికి వెళ్లారు. ఒక్కసారిగా సినారె భౌతిక కాయాన్ని చూసిన ఆయన ఉద్వేగాన్ని ఆపుకోలేక కంటతడిపెట్టారు. ఇది చూసిన అక్కడి వారు చలించిపోయారు. సినారె మరణం తెలుగు జాతికి తీరని లోటని..రవీంద్రభారతిలో జరిగిన ఎన్నో కార్యక్రమాల్లో తాను, సినారె కలిసి పాల్గొన్నామని గుర్తు చేసుకున్నారు. తనను ఆయన ఇంటిపేరుతో సహా పిలిచేవారని అన్నారు.