అదే పోలీస్ స్టేషన్.. మరో ఎస్సై ఆత్మహత్య..
posted on Jun 14, 2017 3:46PM
.jpg)
ఉన్నతాధికారుల వేధింపులు తాళలేక ఈ మధ్య పలువురు పోలీసు అధికారులు ఆత్మహత్య చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా మరో ఎస్సై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేటలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.... సిద్ధిపేట జిల్లా కొండపాక మండలం కుక్కునూరు పోలీస్‌స్టేషన్‌లో ప్రభాకరర్‌రెడ్డి ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే అతను తన గదిలో కుర్చీపై కూర్చుని తుపాకీతో కణతపై కాల్చుకొని మృతి చెందాడు. అయితే ఉన్నతాధికారుల వేధింపుల వల్లే ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా ప్రభాకర్‌రెడ్డి 2012లో ఎస్‌ఐగా ఎంపికయ్యారు. 2016 ఆగస్టు 26న ఆయన కుక్కునూరుపల్లి పీఎస్‌లో ఎస్‌ఐగా విధుల్లో చేరారు.
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇదే పోలీస్ స్టేషన్ లో పది నెలల క్రితం రామకృష్ణారెడ్డి అనే ఎస్‌ఐ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు అదే స్టేషన్ లో ప్రభాకర్‌రెడ్డి కూడా అలాగే ఆత్మహత్య చేసుకోవడంతో అందరూ ఆశ్చర్యంవ్యక్తం చేస్తున్నారు. దీనికి అధికారుల వేధింపులే కారణమా..? లేక ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.