మార్చి 3న శ్రీవారి ఆలయం మూసివేత

 

చంద్ర గ్రహణం కారణంగా మార్చి 03న తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం 10 గంటలకు పైగా మూసివేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. మార్చి 03 ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు క్లోజ్ చేయనున్నాట్లు తెలిపింది. గ్రహణ సమయానికి ఆరు గంటల ముందు ఆలయ తలుపులు మూసివేయడం ఆచారం.  

మార్చి 03న రాత్రి 8:30 గంటల తర్వాత శుద్ధి మరియు ఇతర శుద్ధి కర్మల తర్వాత భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. చంద్రగ్రహణం కారణంగా,  అష్టదళ పాదపద్మారాధన సేవ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలకర సేవను టిటిడి రద్దు చేసింది. భక్తులు గమనించాలని టీటీడీ కోరింది
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu