జనవరిలో వరుసగా 4 రోజులు బ్యాంకుల బంద్.. ఎందుకంటే?

బ్యాంకు ఉద్యోగులు సమ్మె సైరన్ మోగించారు. ఈ నెల 27న దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. వారానికి ఐదు రోజుల పని విధానం, వేతన సవరణ తదితర అంశాలపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని అఖిల భారత బ్యాంకు అధికారుల కాన్ఫెడరేషన్ (ఐఐబీఓఎస్) సమ్మెకు పిలుపు నిచ్చింది.

ఈ సమ్మె కారణంగా జనవరి నెలలో బ్యాంకులు వరుసగా నాలుగు రోజులు మూతపడనున్నాయి. అదెలాగంటే.. జనవరి 24  నాలుగవ శనివారం,  , 25 ఆదివారం రావడం ఆ మరుసటి రోజు సోమవారం గణతంత్ర దినోత్సవం కావడంతో వరుసగా మూడు రోజలూ బ్యాంకులకుసెలవు. ఇక 27 మంగళవారం   సమ్మె కారణంగా బ్యాంకులు పని చేయవు. దీంతో బ్యాంకు సేవలు వరుసగా నాలుగు రోజులు అందుబాటులో ఉండవు.   

Online Jyotish
Tone Academy
KidsOne Telugu