కాన్సర్ కి టిఫానీ వైద్యం!
posted on Oct 20, 2022 5:22PM
ఒత్తుగా, పొడవుగా చక్కటి జడ వేసుకుని ఆడపిల్లలు తిరుగుతూండాలే అంటూంది పెద్దమ్మ. అలా ఈ రోజుల్లో అవుతోందా? పదో తరగతి దాటితే చాలు పొడవు జడ కాస్తా స్టయిల్ మార్చుకుంటుంది. కానీ అది ఏమాత్రం బావుందనేది వేరే సంగతి.ట్రండ్ ఫాలో కావాలి. అభిమాన హీరోయిన్ ఎలా వేసుకుంటే అలా ఉండాలంతే. దీనికి తల్లి కూడా అంగీకరించాల్సిందే. పిల్ల మరీ ముద్దొస్తోందే.. పోనీలే ఉండనీ అని గారా బు చేసి పెద్దామెను ఒప్పిస్తుంది. అదో సరదా! కానీ ఈ పాప మాత్రం సరదాగా ఏమీ లేదు. అద్దం ముందు చూసుకుంటున్న తన వొత్తయిన చూడముచ్చటి జుత్తు చూసి ఎంతో ఆనందిస్తోంది. కానీ అదో విగ్గు! అవును విగ్గు పెడుతున్నావిడ పేరు టిఫానీ.
టిఫానీకి ఆ పిల్లంటే మహా ప్రేమ. అంతకు మించిన దయా, కరుణ. కానీ ప్రేమ కంటే దయను ఆమె ప్రదర్శించడం ఇష్టంలేదు. ఎందుకంటే ఆ పిల్ల అనారోగ్యం టిఫానీకి బాగా తెలుసు. ఆ పిల్ల చూడ ముచ్చట గానే ఉంది. కానీ ఆమె కాన్సర్‌తో బాధపడుతోంది. ఆమెకు కెమో థెరిపీ చేస్తున్నారు. ఆ కారణంగా ఆ చిన్నతల్లి చక్కటి జుత్తును కోల్పోయింది. కానీ ఆమెను దిగులుగా చూడటం ఇష్టంలేక తల్లి విగ్గు పెట్టించి ఆ పిల్లను ఆనందంగా ఉండేట్టు చేసింది. అందుకే విగ్గులు తయారుచేసి ఇలాటివారికి ఉచితంగా ఇచ్చే టిఫానీ అనే ఫ్యాషన్ డిజైనర్‌ని కలిసింది. పాప కథ విన్నది. తీసుకువచ్చాక మనసు రోదించింది. దగ్గరకు తీసుకుని నీకు మంచి జుత్తు నేను ఇస్తానన్నది. అంతే కొత్తగ తయారుచేయించి ఆమెకు అమర్చి అద్దం ముందు కూర్చోబెట్టి చూపింది.
ఆమెకు కాన్సర్ అని తెలిసినప్పటికి ముందు, కిమోథెరపీ చేయించుకోవడానికి ముందు ఎలా ఉండేదో అంతే అందమైన జుత్తుతో ముద్దుగా ఉంది. ఆ భావం టిఫానీ కల్పించింది. అదే ఆనందంతో ఆమె మరి కొన్నాళ్లు ప్రశాంతంగా, ఇతర పిల్లల్లా చక్కగా నవ్వుతూ సరదాగా బతికేస్తుంది. వాస్తవానికి ఆమె జబ్బు చాలా సీరియస్ స్థాయికి చేరుకుందని డాక్టర్లు చెప్పారు. ఆమెకు మాత్రం అదేమాత్రం నిన్ను బాధిం చదు. కాకుంటే కాస్తంత జుత్తు పోయిందంతే...జుత్తుకోసం బెంగెట్టేసుకోకమ్మా.. అన్నారు. డాక్టర్లు ఇచ్చే ధైర్యం, తల్లిదండ్రుల ప్రేమ ఆమెను మరింత కాలం కాలంగడిపేలా చేస్తుంది. ఇపుడు ఆమెకు టిఫానీ ఇచ్చిన ధైర్యాన్ని, సరదానీ మించి ఎవరు ఇవ్వగలరు. తోటి స్నేహితులు, పక్కింటివాళ్లూ ఆమెను మళ్లీ ఇంతే సరదాగా చూడాలనుకుంటున్నారు. ఇదే చూస్తారు, చూడాలి. ఆమె చిరకాలం బతకాలనే అనుకుంటు న్నారు. మనసు మాత్రం రోదిస్తోంది.