మగవారిలో నీరసం.. అలసట ఎక్కువగా ఉంటోందా... కారణం ఇదే కావచ్చు!

శరీరం సరిగ్గా పనిచేయాలంటే, హార్మోన్ల స్థాయిని సరిగ్గా ఉండడం అవసరం. మగవారి మంచి ఆరోగ్యం, మెరుగైన శారీరక పనితీరులో టెస్టోస్టెరాన్ హార్మోన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. టెస్టోస్టెరాన్ సాధారణంగా సెక్స్ హార్మోన్‌గా పరిగణించబడుతుంది, ఇది శరీరంలో ఎన్నో ఇతర ముఖ్యమైన పాత్రలను పోషిస్తుంది. పురుషులలో, ఈ హార్మోన్ సెక్స్ డ్రైవ్ (లిబిడో) నుండి ఎముక ద్రవ్యరాశి, కొవ్వు పదార్ధం, కండరాల ఆరోగ్యం, కండరాల బలాన్ని కాపాడుకోవడం, ఎర్ర రక్త కణాలు, స్పెర్మ్ ఉత్పత్తిని నియంత్రించడం ఇలా ప్రతిదానికీ అవసరం.

అయితే అనేక కారణాల వల్ల యువతలో టెస్టోస్టెరాన్ లోపం నిర్ధారణ అవుతోంది, ఇది లిబిడో, సెక్స్ పవర్ సమస్యలను పెంచడమే కాకుండా శరీరంలో ఇతర సమస్యల ప్రమాదాన్ని కూడా పెంచుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

మరీ ముఖ్యంగా టెస్టోస్టెరాన్ లోపం ఎముకల వ్యాధుల నుండి తీవ్రమైన అలసట వరకు అన్నింటికీ కారణమవుతుంది.

అసలు టెస్టోస్టెరాన్ లోపం ఎందుకు వస్తుంది?

శరీరంలో టెస్టోస్టెరాన్ హార్మోన్ లేకపోవడం అనేక కారణాల వల్ల జరుగుతుంది.  కీమోథెరపీ వంటి ఔషదాల  దుష్ప్రభావం, వృషణానికి గాయం లేదా క్యాన్సర్. మెదడులోని గ్రంధుల సమస్యలు (హైపోథాలమస్ మరియు పిట్యూటరీ), ఇది హార్మోన్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది. థైరాయిడ్ పనితీరు సమస్యలు, అధిక శరీర బరువు (ఊబకాయం). దీర్ఘకాలిక వ్యాధులు లేదా అంటువ్యాధులు. మొదలైన కారణాల వల్ల ఈ హార్మోన్ లోపం వస్తుంది. 

టెస్టోస్టెరాన్ లేకపోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయంటే..

శరీరంలో టెస్టోస్టెరాన్ హార్మోన్ లేకపోవడం వల్ల శక్తి లేనట్టుగా ఉంటారు. తరచుగా అలసట-బలహీనతను కలుగుతుంది. వృద్ధాప్యం మీదకొచ్చినట్టు, నిరాశ, నిస్పృహ ఎక్కువగా ఉంటాయి.  చాలా కాలంగా ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటుంటే, ఖచ్చితంగా వైద్యులను కలవాలి.

టెస్టోస్టెరాన్ హార్మోన్ లోపం ఉంటే ఈ రెండు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. 

మూడ్ మార్పులు

తక్కువ టెస్టోస్టెరాన్ స్థాయిలు మానసిక స్థితికి సంబంధించిన సమస్యలను కలిగిస్తాయి. విచారం, పనిలో ఆసక్తి కోల్పోవడం, డిప్రెషన్ వరకు ఈ సమస్యలు ఉంటాయి. కొంతమంది పురుషులలో దీని కారణంగా వ్యక్తిత్వంలో మార్పులు కూడా వస్తాయి. దీని కారణంగా వారిని కాంప్రమైజ్ చేయడం కష్టమైన సమస్యగా మారుతుంది. . టెస్టోస్టెరాన్ స్థాయి సాధారణమైనప్పుడు, అటువంటి సమస్యలు కూడా నయమవుతాయి.

కండరాలు, ఎముకల సమస్యలు

టెస్టోస్టెరాన్ హార్మోన్ కండరాలను నిర్మించడంలో సహాయపడుతుంది. కాబట్టి, దాని పరిమాణం తగ్గినప్పుడు, కండరాలు, దాని బలం కూడా తగ్గుతుంది. తక్కువ టెస్టోస్టెరాన్ స్థాయిలు ఉన్నవారిలో ఎముక సాంద్రత తగ్గడం నుండి బోలు ఎముకల వ్యాధి వరకు సమస్యలు వస్తాయి..

రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. వ్యాయామం చేసేటప్పుడు పెద్ద కండరాలు బాగా పనిచేసేలా ప్లాన్ చేసుకోవాలి. దీనివల్ల హార్మోన్ల సమతుల్యత బాగుంటుంది.  

                              ◆నిశ్శబ్ద.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News