అజ్ఞాతంలోకి గాలి అక్కా బావా

తిరుపతి: అక్రమ మైనింగ్ కేసులో అరెస్టయిన బిజెపి నాయకుడు గాలి జనార్దన్ రెడ్డి అక్క రాజేశ్వరి, బావ సుధాకర్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. గాలి జనార్దన్ రెడ్డిని అరెస్టు చేసిన రోజే ఆయన సోదరి ఇంటిపై సిబిఐ అధికారులు దాడులు నిర్వహించవచ్చుననే ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే వారు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. గాలి జనార్దన్ రెడ్డి అక్కాబావలు చిత్తూరు జిల్లా కాళహిస్తిలోని ఎస్పీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలోని ఇంట్లో ఉంటున్నారు. బావ సుధాకర్ రెడ్డి కెవిబి పురం మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. అక్కపై గాలి జనార్దన్ రెడ్డికి అమితమైన మక్కువ. దీంతో ఆమెకు గాలి జనార్దన్ రెడ్డి  సుమారు రూ5కోట్ల విలువచేసే అత్యధునాతమైన ఇళ్లు నిర్మించి ఇచ్చినట్లు చెబుతారు. గాలి జనార్దన్ రెడ్డి ఇక్కడికి వస్తుండేవారు. హెలికాప్టర్‌లో ఎస్వీ డిగ్రీ కళాశాలలో దిగి అక్కడి నుంచి కారులో అక్క ఇంటికి వస్తుండేవారు.సోదరి చేసిన విజ్ఞప్తి మేరకే జాలి సోదరులు శ్రీకాలహస్తీస్వర స్వామికి రూ.రెండు కోట్ల విలువ చేసే స్వర్ణ అలంకార కవచం కానుకగా సమర్పించారు.  జ్ఞానప్రసూనాంబిక అమ్మవారికి గాలి సోదరులు రూ. 6.5 కోట్ల విలువచేసే వజ్రఖచితమైన స్వర్ణాభరణాలు, వజ్రకిరీటం కానుకలుగా సమర్పించారు. వాటి వాస్తవిక విలువను నిర్ధారించేందుకు దేవస్థానం సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu