తెలంగాణ గ్రూపు-3 ఫలితాలు విడుదల

 

తెలంగాణ గ్రూపు-3 ఫలితాలను టీజీపీఎస్‌సీ విడుదల చేసింది.  మొత్తం 1370 మంది ఎంపికైనట్లు టీజీపీఎస్‌సీ వెల్లడించింది. అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఇటీవల సర్టిఫికెట్ వెరిఫికెషన్ జరిగిన సంగతి తెలిసిందే.

కాగా, ఇటీవలే ఫలితాలు విడుదల చేసింది. జనరల్‌ ర్యాంకుల జాబితాను కమిషన్‌ ప్రకటించింది. గత ఏడాది నవంబర్‌ 17, 18 తేదీల్లో నిర్వహించిన గ్రూప్‌-3 పోస్టులకు 5.36 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 50.24 శాతం మంది మాత్రమే పరీక్షలకు హాజరయ్యారు. 

పురుషుల్లో టాప్‌ ర్యాంకర్‌కు 339.24 మార్కులు, మహిళా టాప్‌ ర్యాంకర్‌కు 325.15 మార్కులొచ్చాయి.  2022 లో 1388 పోస్టుల భర్తీకి గ్రూప్ 3 నోటిఫికేషన్ వెలువడింది. గత ఏడాది నవంబర్ 17,18 తేదీల్లో పరీక్షలు జరిగాయి. కోర్టు కేసులు, గ్రూప్-1,2 వివాదాల కారణంగా గ్రూప్-3 ఫలితాలు ఆలస్యంగా విడుదల చేశారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu