కవిత, వి.హనుమంత్ రావుల రెచ్చగొట్టే వ్యాఖ్యలు
posted on Aug 19, 2013 4:04PM
హైదరాబాద్ లో శనివారం విధ్యుత్ సౌధలో ఉద్యోగుల భోజన విరామ సమయంలో ప్రత్యేక రాష్ట్రానికి మద్దతుగా తెలంగాణా ఉద్యోగుల ప్రదర్శన నిర్వహించారు. ఆ కార్యక్రమానికి హాజరైన తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు కవిత చెప్పులు లేకుండా హైదరాబాద్ వచ్చి అక్రమంగా కోట్లు సంపాదించిన పెట్టుబడిదారులు చేస్తున్నదే సమైక్య ఉద్యమం అని విమర్శించారు.
" అలా అప్పుడు చెప్పులు లేని ఆ పాదాల దగ్గర కూర్చుని బాంచన్ కాల్మొక్తా" అని వాళ్ళు అనే వారని కొంతమంది ప్రజల అభిప్రాయం.
అలాగే " తిరుమలలో సీమాంధ్ర ఉద్యోగులకు కొత్తగా ఏర్పడే తెలంగాణా రాష్ట్రంలో స్థానం లేదని" రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు వ్యాఖ్యానించారు.
ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ హైదరాబాద్ లో అందరూ ఉండొచ్చుఅనీ, ఆంధ్రవాళ్ళకి రక్షణ కల్పిస్తామని తెలంగాణా నేతలు అంటున్నారు. ఇది నమ్మదగ్గ విషయంలా లేదని కొంతమంది అనుకుంటున్నారు.
తెలుగు భాష మాట్లాడే అందరిదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దానికి రాజధాని అయిన హైదరాబాద్ లో ఒక తెలుగు వాడికి మరో తెలుగు వాడు రక్షణ కల్పిస్తామని అంటున్నారు ఇది ఏ పాకిస్థాన్ లోనో, దుబాయ్ లోనో నివసించే తెలుగు వారికి రక్షణ కల్పిస్తామని అన్నట్టుగా ప్రజలు ఆశ్యర్య పోతున్నారు.
దీనిపై పాఠకులను చర్చించమని కోరుతున్నాం. వారి వారి విలువైన అభిప్రాయాలను ఇక్కడ పోస్ట్ చేయమనికోరుతున్నాం.