టిడిపి హరికృష్ణ ఆత్మావిష్కరణ లేఖ
posted on Aug 19, 2013 3:43PM
తెలుగుదేశం ఎమ్.పి నందమూరి హరికృష్ణ మళ్లీ ఒక లేఖ రాశారు. తెలుగు జాతి కోసం అప్పట్లో నా తండ్రి ఎన్టీఆర్ చేసిన ప్రసంగాలు ఇప్పటికీ నా చెవుల్లో రింగురింగుమని మార్మోగుతూనే ఉన్నాయి. పార్టీ కార్యకర్తగా పార్టీ నిర్ణయాన్ని శీరసావహించినా..ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో నేను సమైక్యవాదానికే కట్టుబడి ఉంటాను. ఆ దిశగానే ముందడుగు వేస్తున్నానని” ఆత్మావిష్కరణ పేరుతో నేడొక లేఖ విడుదల చేశారు. అయితే తన లేఖతో పార్టీకి సంబంధం లేదని ఆయన తేల్చిచెప్పారు.
ప్రజల మధ్య కాంగ్రెస్ పార్టీ చిచ్చు పెట్టిందని, విభజన కోసం కొందరు నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఇది సీమాంధ్ర ప్రజలను ఆందోళనకు గురిచేస్తుందని, తెలుగువారి మధ్య రాజుకున్న నిప్పు చూసి ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తుందని ఆయన లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ భవిష్యత్ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ ను తాకట్టు పెట్టిందని అన్నారు.