హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రం: కావూరి
posted on Aug 19, 2013 4:28PM
తెలంగాణ ప్రకటన అంశంపై కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు ఎట్టకేలకు నోరువిప్పారు. రాష్ట్ర విభజన అంశంపై తమ మొదటి ప్రాధాన్యత సమైక్యాంధ్రాకే అన్నారు. తప్పని పరిస్థితుల్లో రాష్ట్రాన్ని విభజించాల్సి వస్తే హైదరాబాద్‌ను ప్రత్యేక రాష్ట్రం చేయాలన్నారు. చాల రోజులుగా మౌనంగా ఉన్న ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.
మూడు ప్రాంతాల రాజధానిగా ఉన్న హైదరాబాద్ అభివృద్దిలో అందరి కృషి ఉందని కాబట్టి హైదరాబాద్ అన్ని ప్రాంతాల వారికే చెందేలా నిర్ణయం ఉండాలన్నారు. తన మొదటి ప్రాదాన్యత మాత్రం సమైఖ్య రాష్ట్రానికే అని చెప్పారు. అధిష్టానం తప్పకుండా విభజన నిర్ణయాన్ని పునరాలొచిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే అందుకు సంభందించిన ప్రకటన కూడా వెలవడే అవకాశం ఉందన్నారు.ఈ అంశానికి సంబంధించి సాయంత్రం తొమ్మిది మంది సీమాంధ్ర మంత్రులతో సమావేశం కానున్నట్లు ఆయన తెలిపారు.
అనివార్య మైన పక్షంలో రాజీనామాలకు కూడా వెనకాడమన్న కావూరి, అధిష్టానం మీద ఇంకా నమ్మకముందన్నారు. ఎప్పటికీ సమైక్యవాదులుగానే ఉంటామని రాష్ట్ర౦ ముక్కలు కాకుండా చూడాలని ఆంటోని కమిటీకి నివేదిస్తామన్నారు. విభజన వల్ల శాస్త్రీయంగా ఎలాంటి నష్టాలు వస్తాయో కమిటీ ముందుంచుతామన్నారు