రెండో పెళ్ళికి కూడా ఓకే... తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం

 

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్యాణ లక్ష్మి పథకం కింద పేద కుటుంబాలకు లక్ష నూట పదహారు రూపాయలు ప్రభుత్వం అందిస్తోన్న సంగతి తెలిసిందే. పేద కుటుంబాలు తమ ఆడపిల్లల వివాహాల కోసం ఇబ్బందులు పడకుండా ఈ పథకం ఎంతో ఉపయోగ పడుతోంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఇదే విషయం పై మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై రెండో పెళ్లికి కూడా ఆర్థిక సాయం చేయడానికి నిర్ణయించింది. పెళ్లైన మహిళలు విడాకుల ద్వారా కానీ లేక భర్త చనిపోయినా, లేక వేరే  కారణాలతో భర్తతో వేరుగా ఉండే పేద యువతులకు ఆసరాగా నిలబడేందుకు కేసీఆర్ ప్రభుత్వం ముందుకొచ్చింది. అలాంటి మహిళలు రెండో వివాహం చేసుకోవాలని భావిస్తే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా ఆర్థిక సాయం అందించనుంది. అయితే ఈ పథకం అంతకు ముందు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద లబ్ధిపొందనివారికే ఈ అవకాశం దక్కనుంది.