సామాన్యుడికి ఒక న్యాయం... సార్లకు ఒక న్యాయం

 

 

హైదరాబాద్ లో ట్రాఫిక్ చలాన్ల వసూళ్ల విషయంలో సామాన్యుల దగ్గర ముక్కు పిండి వాసులు చేసే ట్రాఫిక్ సిబ్బంది... అదే అధికారులు, పాలకుల విషయంలో మాత్రం చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఎప్పటి నుండో వినిపిస్తూనే ఉన్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు వాడే వాహనాల నంబర్ల పైన జరిమానాలు ఎంతగా పేరుకు పోయినా... ట్రాఫిక్ సిబ్బంది వాటిని పట్టించుకోని దాఖలాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఒక ఉన్నతాధికారి ఉదంతం ఒకటి ఓ నెటిజన్ బయటపెట్టడంతో వెలుగు చూసింది. హైదరాబాద్ నగర పాలక సంస్థ  (GHMC) కమీషనర్ వాహనంపై ఏకంగా రూ. 6 వేలకు పైగా చలాన్లు పెండింగులో ఉన్నాయి. అయితే మరో విషయం ఏమిటంటే ఇవన్నీ ఓవర్ స్పీడ్ కారణంగా నమోదైన జరిమానాలే. గత కొన్ని నెలలుగా ఈ చలాన్లను క్లియర్ చేసి ప్రయత్నం జరగ లేదు. చూద్దాం ప్రభుత్వ  ఉన్నతాధికారి కదా అని వదిలేస్తారో లేక ఆ ఫైన్ మొత్తం వసూలు చేస్తారో.