రవాణా పన్ను చెల్లించాల్సిందే.. కోర్టు
posted on Apr 10, 2015 11:44AM
తెలంగాణ రాష్ట్రంలోకి ఏపీ వాహనాలు ప్రవేశిస్తే పన్ను కట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొంతమంది కోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఈ అంతర్రాష్ట్ర పన్నులపై హైకోర్టు మధ్యంతర ఉత్వర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే వాహనాలకు రవాణా పన్ను చెల్లించాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. అయితే రవాణ పన్నును బ్యాంకుల్లో జమచేయాలని వాహనదారులను ఆదేశించింది. ఈ డబ్బు దేనికీ వాడకూడదని కోర్టు సూచించింది. ఈ కేసు విషయంలో కౌంటర్ దాఖలు చేయాలంటూ రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించింది. అయితే కోర్టును ఆశ్రయించిన యజమానులకే ఈ తీర్పు వర్తిస్తుందని పేర్కొంది. ఈ కేసులో విచారణ కొనసాగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది.