వరల్డ్ ఎకనామిక్ ఫోరం కు తెలంగాణ సీఎం రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ వేదికగా జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు హాజరు కానున్నారు. ఈ నెల 20 నుంచి 24 వరకూ ఐదు రోజుల పాటు దావోస్ వేదికగా ప్రపంచ ఆర్థిక సదస్సు జరగనున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 21నుంచి 23 వరకూ మూడు రోజుల పనాటు ఈ సదస్సులో పాల్గొంటారు.

కాగా దోవోస్ కంటే ముందు  ఆస్ట్రేలియా, సింగపూర్ లలో పర్యటించనున్నారు.  ఈ నెల 15 నుంచి 19 వరకూ ఐదు రోజుల పాటు అధికారుల బృందంతో ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు.  అనంతరం 19నే సింగపూర్ చేరుకుంటారు. 19, 20 తేదీలలో సింగపూర్ లోపర్యటిస్తారు. అనంతరం దావోస్ వెడతారు. మంత్రి రేవంత్ రెడ్డి వెంట ఈ పర్యటనలో రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజన్ ఇతర ఉన్నతాధికారులు ఉంటారు.