రియల్ పెళ్ళిలో సినిమా టైప్ ట్విస్టులు



లొకేషన్: తమిళనాడులోని క‌ృష్ణగిరిలో ఓ కళ్యాణ మండపం.

వధూవరులు: రమేష్, అనిత.

ట్విస్ట్ 1: కొద్దిసేపట్లో పెళ్ళి జరగబోతుందనగా అక్కడకి మాదేష్ అనే యువకుడు ఎంటరయ్యాడు. పెళ్ళికూతురు, తాను ప్రేమించుకున్నామని ఆమెని తనకే ఇచ్చి పెళ్ళి చేయాలని గొడవ చేశాడు. తన వెంట తెచ్చుకున్న మంగళ సూత్రాన్ని పెళ్ళికూతురు మెడలో కట్టబోయాడు.

ఫైట్: ఎవడో వచ్చి ప్రేమ దోమ అంటూ పెళ్ళికూతురి మెడలో తాళికట్టబోయేసరికి అక్కడ వున్నవాళ్ళందరూ అతని మీద పడి ఇరగ్గొట్టారు.

ట్విస్ట్ 2: అందరి చేతిలో చావుదెబ్బలు తిన్న మాదేష్ అక్కడి నుంచి వెళ్ళిపోకుండా జేవులోంచి విషం బాటిల్ తీశాడు. అందరూ చూస్తుండగానే విషం తాగేశాడు. అందరూ అదిరిపోయి అతన్ని ఆస్పత్రికి తరలించారు.

క్లైమాక్స్:  పెళ్ళి ఘనంగా జరిగిపోయింది. అయితే రమేష్ - అనితలకు కాదు. పెళ్ళికి చుట్టపు చూపుగా వచ్చిన దివ్య అనే మరో అమ్మాయితో రమేష్ పెళ్ళి జరిగింది.. అనితను పెళ్ళాడటానికి రమేష్ నిరాకరించడంతో పెద్దలంతా కలసి ఈ అడ్జెస్ట్‌మెంట్ చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu