కేంద్రంతో పోరాటానికి రెడీ: కేసీఆర్
posted on Aug 9, 2014 8:59AM
.jpg)
మరో పదేళ్ళపాటు ఉమ్మడి రాజధానిగా ఉండబోయే హైదరాబాదు పరిధిలో శాంతి భద్రతల బాధ్యతలు, సర్వాధికారాలు గవర్నరు నరసింహన్ కు కట్టబెడుతూ కేంద్ర హోంశాఖ తెలంగాణా ప్రభుత్వానికి నిన్న జారీచేసిన మార్గదర్శకాలను తెలంగాణా ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేఖించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఈ మార్గదర్శకాలు తమకు ఎంతమాత్రం అంగీకారంకావని తెలియజేస్తూ కేంద్రానికి వెంటనే ఒక లేఖ వ్రాసారు. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర విమర్శలు చేసారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికయిన ప్రభుత్వ అధికారాలను కేంద్రం ఈ విధంగా కబళించదాన్ని తాను తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నాని, రాజ్యాంగ స్పూర్తికి విరుద్దంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను తమ ప్రభుత్వం పట్టించుకొబోదని స్పష్టం చేసారు. దేశంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఈ లేఖ ప్రతులను పంపించి, రాష్ట్రాధికారాలను హరిస్తున్న కేంద్రంపై పోరాటానికి తమతో కలిసిరావలసిందిగా ఆహ్వానిస్తామని తెలిపారు. త్వరలోనే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేసి దీనిపై ఉద్యమిస్తామని తెలిపారు.