భూ కుంభకోణం కేసులో మాజీ గవర్నరు బెనీవాల్

 

గతంలో అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు మిజోరాం గవర్నరు పదవి పోగొట్టుకొన్న కమలా బెనీవాల్ ను ఇంకా అవినీతి కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. ఆమెపై జైపూరు కోర్టులో భూ ఆక్రమణకు పాల్పడినట్లు సంజయ్‌ అగర్వాల్‌ అనే ఒక సామాజిక కార్యకర్త కేసు వేసారు. దాదాపు వెయ్యి కోట్లు విలువ గల ఈ భూ ఆక్రమణ కేసును దర్యాప్తు చేసిన వైశాలి నగర్ పోలీసులు కమలా బెనీవాల్ తో పాటు మరో 16మందిని నిందితులుగా పేర్కొన్నారు. ఇంతవరకు ఆమె గవర్నరు హోదాలో ఉన్నందున ఆమెపై ఎటువంటి చర్యలు తీసుకొనే అవకాశం పోలీసులకు కలగలేదు. కానీ ఆమె ఇప్పుడు ఆ పదవి పోగొట్టుకోవడంతో త్వరలోనే ఆమెకు కోర్టు సమన్లు జారీ చేసే అవకాశం ఉంది. అత్యంత ఉన్నతమయిన గవర్నరు పదవిని నిర్వహించిన వ్యక్తులు సైతం ఇటువంటి భూ కుంబకోణాలలో నిందితులుగా పేర్కొనబడటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu