తెలంగాణ సర్కార్ కు హైకోర్టు షాక్....

 

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సాగునీటి ఫథకాల కోసం తెలంగాణ ప్రభుత్వం 123 జీవో ప్రకారం భూములు సేకరించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై పలువురు రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో దీనిపై కోర్టులో వాదనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఈ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు తెలంగాణ సర్కార్ కు షాక్ నిచ్చింది.  2013 భూసేక‌ర‌ణ ప‌ద్ధ‌తిలో భూమి సేక‌రిస్తే ఎటువంటి అభ్యంత‌రాలు ఉండ‌బోవ‌ని..  జీవో నెంబ‌రు.123 ద్వారా భూములు తీసుకోవ‌ద్ద‌ని ఆదేశించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu