శశికళ పుష్పకు షాక్... శశికళ నటరాజన్ సేఫ్..
posted on Jan 5, 2017 11:03AM
.jpg)
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప ఇప్పటికే పలు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. జయలలిత మృతికి శశికళ నటరాజనే కారణమంటూ.. అమ్మ మృతిపై అనుమానాలు ఉన్నాయని... వాటిపై దర్యాప్తు చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్న సంగతి కూడా విదితమే. ఈ నేపథ్యంలోనే శశికళ పుష్ప సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే కోర్టులో ఆమెకు చుక్కెదురైంది. జయలలిత మృతిపై అనుమానాలున్నాయని, ఆమె మృతిపై సీబీఐతో విచారించేలా ఆదేశించాలంటూ ఆమె పిటషన్ లో పేర్కొన్నారు. ఇప్పుడు దీనిపై విచారించిన సుప్రీంకోర్టు... పిటిషన్ ను కొట్టేసింది. అంతేకాదు.. ఇలాంటివాటితో మరోసారి పిటిషనర్లు బలవంతపెడితే జరిమానా విధిస్తామని హెచ్చరికలు చేసింది. దీంతో శశికళ పుష్ప కు షాక్ తగలగా.... శశికళ నటరాజన్ మాత్రం సేఫ్ సైడ్ లో పడ్డారు.