జగన్ ప్రత్యేక విమానంలో సాంకేతిక లోపం.. మరో విమానంలో పయనం

గత నాలుగు రోజుల నుంచి ఎలాగైనా ఢిల్లీ వెళ్లాలని పట్టదలగా ఉన్న సీఎం జగన్, ఎట్టకేలకు   షెడ్యూల్ ఖరారు చేసుకుని విమానం ఎక్కారు..  అయితే గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరిన జగన్ ప్రత్యేక విమానం కాసేపటికే సాంకేతిక లోపం కారణంగా నిముషాల వ్యవధిలోనే సాంకేతిక లోపం కారణంగా వెనుదిరిగి  గన్నవరం విమానాశ్రయంలోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది.

తర్వాత జగన్ వెంటనే తాడేపల్లికి వెళ్లిపోయారు. రాత్రి 9 గంటలకు మరో ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. ప్రత్యేక విమానంలో సాంకేతిక లోపంపై విచారణ జరుగుతోంది.  కాగా మంగళవారం (జనవరి 31) ఉదయం నుంచి ఆయన   ఢిల్లీ.. లీలా ప్యాలెస్ హోటల్‌లో దౌత్యవేత్తలతో జరిగే ఆంధప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సన్నాహక సమావేశం  లో పాల్గొంటారు. ఈఅనంతరం సాయంత్రం 6.05 గంటలకు ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణం అవుతారు.

కాగా ఈ పర్యటన సందర్భంగా ఆయన మోడీ, అమిత్ షా, నిర్మలా సీతారామన్ వంటి వారి అప్పాయింట్ మెంట్ కోసం ప్రయత్నించారని, అయితే అప్పాయింట్ మెంట్ లభించలేదని అంటున్నారు. వాస్తవానికి ఆయన షెడ్యూల్ ప్రకారం జనవరి 30నే హస్తినకు బయలు దేరాల్సి ఉన్నా.. మూడు రోజుల నుంచీ ఆయన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని ఏ క్షణంలోనైనా హస్తిన బయలుదేరడానికి రెడీ అయ్యారు.

అయితే కేంద్ర పెద్దల అప్పాయింట్ మెంట్ కోసం వేచి చూశారు. అది లభించకపోవడంతో ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే హస్తిన వెళ్లి అక్కడ ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్ట్ ర్స్ సమ్మిట్ సన్నాహక సమావేశంలో పాల్గొని వెంటనే తిరిగి వస్తున్నారు. సాధారణంగా జగన్ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా ఆయనకు ప్రధాని సహా కేంద్ర పెద్దల అప్పాయింట్ మెంట్ లు వెంటనే లభించేస్తూ ఉంటాయి. కానీ ఈ సారి మాత్రం నాలుగు రోజుల పాటు ఎదురు చూసినా అది లభించలేదు.