మహాకూటమి:హోం, నీటి పారుదలశాఖ తెదేపాకే
posted on Oct 26, 2018 5:06PM
.jpg)
కొడంగల్ నియోజకవర్గం నుంచి వివిధ పార్టీల నాయకులు హరీశ్ రావు సమక్షంలో తెరాసలో చేరారు. ఈ సందర్బంగా మాట్లాడిన హరీష్ రావు కొడంగల్‌లో గులాబీ జెండా ఎగుర వేస్తామని ధీమా వ్యక్తం చేశారు.అలాగే మహాకూటమిపై కూడా హరీష్ రావు విమర్శలు గుప్పించారు.జరగబోయే ఎన్నికల్లో మహాకూటమి గెలిచే ప్రసక్తే లేదని, కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు.తెదేపాను ఆంధ్రా పార్టీ అని పొలిమేరల వరకు తరిమేస్తే కాంగ్రెస్ పొత్తు పెట్టుకొని మళ్ళీ తెలంగాణలోకి తీసుకొస్తోందని హరీశ్ రావు మండిపడ్డారు.తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎప్పుడూ వలసవాదుల పల్లకీలే మోస్తుంటారని ఆయన ధ్వజమెత్తారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు అన్యాయం చేస్తే కాంగ్రెస్ నేతలు వత్తాసు పలికారని,ఇప్పుడు చంద్రబాబును మోస్తున్నారని మండిపడ్డారు.మహాకూటమి గెలిస్తే హోం, నీటి పారుదలశాఖలను తెదేపాకు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారని ఆయన ఆరోపించారు.తెలంగాణను ఎండబెట్టేందుకు నీటిపారుదలశాఖ,ఓటుకు నోటు కేసు నుంచి బయట పడేందుకు హోంశాఖపై తెదేపా కన్నేసిందని హరీశ్ దుయ్యబట్టారు.