నిజాబాబాద్ సభపై తెలుగుదేశం భారీ హోప్స్!
posted on Jan 13, 2023 3:49PM
పూర్వ వైభవాన్ని పునర్ ప్రతి ష్టించేందుకు తెలుగుదేశం పార్టీ పక్కా రాజకీయ ప్రణాళికలతో అడుగులు వేస్తున్నది. అభివృద్ధి, పేద, బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ఉత్తర తెలంగాణలో పాగా వేసేం దుకు రాజకీయ వ్యూహ రచన చేసింది. ఖమ్మం బహిరంగ సభతో దక్షిణ తెలంగాణలో తెలుగుదేశం సత్తా చాటినట్లే నిజామాబాద్ సభతో ఉత్తర తెలంగాణ లో టిడిపి స్థానాన్ని పదిల పర్చుకునేందుకు వ్యూహ రచన చేస్తున్నది.
వచ్చే నెల 12, లేదా 13న నిజామాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నది. గతంలో ఉత్తర తెలంగాణలో ఉన్న టిడిపి కమిటీలు, నాయ కుల జాబీతాను టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పరి శీలించి రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కు సూచనలు చేశారు. ఈ సూచనల మేరకు గతంలో టిడిపి కి కంచుకోటగా ఉన్న ప్రాంతాలు, నాయకులు, త్యాగాలకు సిద్ధంగా ఉన్న శ్రేణుల జాబీతాలను పరిశీలించారు. ఉత్తర తెలంగాణ లో పార్టీలు మారిన నాయకులను తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తూ ఫోన్లు చేస్తున్నట్లు సమాచారం.
అసలు తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో గట్టి పట్టు ఉంది. తెలంగాణ సెంటిమెంట్ కారణంగా అనివార్యంగా ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ కు పరిమితమైనట్లుగా కనిపించినా.. ఇప్పుడు కేసీఆర్ జాతీయ రాజకీయాలంటూ తెరాసను బీఆర్ఎస్ గా మార్చేసి తెలంగాణ సెంటిమెంటుకు చెల్లు చీటీ పాడేయడంతో.. తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో పూర్వ వైభవాన్ని సముపార్జించుకునే అవకాశాలు మెరుగయ్యాయి. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రాంతంలో నిజమైన అభివృద్ధి జరిగింది తెలుగుదేశం హయాంలోనే. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం అధినేత చంద్రబాబు తెలంగాణపై దృష్టి సారించారు. ఖమ్మంలో గత నెల 21న నిర్వహించిన తెలుగుదేశం బహిరంగ సభ సూపర్ సక్సెస్ అయ్యింది.
చంద్రబాబు భారీ కాన్వాయ్ తో హైదరాబాద్ నుంచి బయలుదేరి రోడ్డు మార్గం ద్వారా ఖమ్మం వెళ్లారు. దారి పొడవునా జనం బ్రహ్మరథం పలికారు. తెలంగాణలో తెలుగుదేశంకు ఉన్న క్రేజ్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఖమ్మం సభ సక్సెస్ తో జోరుమీద ఉన్న తెలుగుదేశం వెంటనే మరో బహిరంగ సభకు ప్రణాళిక రచించింది. నిజామాబాద్ లో ఉంటే ఉత్తరతలెంగాణలో సత్తా చాటేందుకు సిద్ధం అయ్యింది. తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షడు కాసాని జ్ణానేందర్ అందుకు సన్నాహాలు షరూ చేశారు. ఖమ్మం సభతో తెలంగాణలో తెలుగుదేశంపై ఒక్కసారిగా అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే భారాస అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన జాతీయ పార్టీ తొలి బహిరంగ సభకు ఖమ్మంనే వేదిక చేసుకున్నారు.
ఖమ్మంలో శంఖరావం పేరిట తెలుగుదేశం నిర్వహించిన భారీ భారీ బహిరంగ సూపర్ సక్సెస్‌తో.. తెలంగాణలోని తెలుగుదేశం పార్టీలో నయా జోష్ కొట్టొచ్చినట్లు కనిస్తోంది. అంతే కాదు తెలుగుదేశం పార్టీ ఆంధ్రలోనే బతికి ఉంది.. తెలంగాణలో మాత్రం కనుమరుగైపోయిందంటూ వస్తున్న విమర్శలకు ఈ సభ సక్సెస్ ఫుల్‌స్టాప్ పెట్టింది. దీంతో కొత్త ఊపు ఉత్సాహంతో తెలంగాణలో తెలుగుదేశం అడుగుల వేగం పెంచింది. అయితే బారాస అధినేత కేసీఆర్.. దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తోందంటూ ప్రకటించారు. అలాంటి వేళ.. ఆయన దేశంలో ఎక్కడైనా ఈ సభను నిర్వహించవచ్చు. కానీ అలా కాకుండా.. తెలంగాణలోని అదీ.. ఖమ్మం వేదికగా ఈ సభను ఏర్పాటు చేయడంతో ఖమ్మం తెలుగుదేశం సభ భారాసాలోనూ ప్రకంపనలు సృష్టించిందని అవగతమౌతోంది.
అసలే ఖమ్మంలో భారాసాకు ఉన్న పట్టు అంతంత మాత్రమే. అందులోనూ ఇప్పుడు ఆ జిల్లా భారాసాలో అసంతృప్తి జ్వాలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. పొంగులేటి, తుమ్మలలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ అక్కడే తమ జాతీయ పార్టీ తొలి బహిరంగ సభ ఏర్పాటు చేయడం.. ఇందుకు ఇతర రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలను ఆహ్వానించడంతో.. ఒక వేళ ఆ సభకు అనుకున్నంతగా జనం రాకపోతే.. తెలుగుదేశం పార్టీకి భారాసా సభే రెడ్ కార్పెట్ వెల్ కమ్ పలికినట్లౌతుందని పరిశీలకులు అంటున్నారు.