తెదేపా యం.యల్సీ. అభ్యర్ధుల పేర్లు ఖరారు

 

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిన్న జరిగిన పార్టీ పోలిట్ బ్యూరో సమావేశంలో ఆంద్రప్రదేశ్ లో ఆరు యం.యల్సీ. స్థానాలకు పోటీ పడుతున్న సుమారు 200 మంది అభ్యర్ధుల పేర్లను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత, వారిలో పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరియు టి.డి.జనార్ధన్ లకు గవర్నర్ కోటాలో, గౌనివారి శ్రీనివాసులు, అనురాధ, యం.ఎ. షరీఫ్, జూపూడి ప్రభాకర్ లకు యం.యల్యే. కోటాలో సీట్లు కేటాయించారు. ఈరోజు నామినేషన్లు దాఖలు చేయడానికి ఆఖరు రోజు కావడంతో వారందరూ ఈరోజే నామినేషన్లు వేస్తారు. యం.యల్యే. కోటాలో వైకాపాకి దక్కిన ఒక్క సీటును గోవింద రెడ్డికి కేటాయించింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఒక్క సీటు గెలవలేకపోవడంతో దానికి ఈ ఎన్నికలలో అభ్యర్ధిని నిలబెట్టే అవకాశం లేదు. బీజేపీ తరపున సోము వీర్రాజు యం.యల్యే. కోటాలో యం.యల్సీ. సీటుకి నామినేషన్ వేస్తున్నారు.