చర్చలు విఫలం కావడంతో సమ్మెకు సిధ్ధమంటున్న ఆర్టీసీ నాయకులు...

 

ఆర్టీసీ కార్మికుల సమ్మె యోచనపై ప్రభుత్వం తీవ్రంగా దృష్టి పెట్టింది. వాళ్లు సమ్మె ఆలోచన నుంచి బయటకు వచ్చేలా ముందు గానే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాల నాయకులతో జరిపిన చర్చలు ముగిశాయి. 26 డిమాండ్ లను కమిటీ ముందుంచింది ఆర్టీసీ, జేఏసీ. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ లను సానుకూలంగా విన్నామన్నారు ఆర్.జి.టి ఇన్ చార్జ్ ఎండీ సునీల్ శర్మ.

సిఎం కేసిఆర్ ఆర్టీసిపై ప్రత్యేక దృష్టి పెట్టారని రాజ్యాంగ బద్ధంగా ఐ.ఏ.ఎస్ ల కమిటీ ఏర్పడిందన్నారు సోమేశ్ కుమార్, దసరా సమయంలో సమ్మె వద్దని విజ్ఞప్తి చేశామన్నారు. అన్ని సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయని కాస్త ఓపిక పట్టాలని ఆర్టీసీ ఉద్యోగులను కోరామన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందిగా ఆర్టిసికి సంబంధించినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ నెల ఐదు నుంచి వాళ్లు సమ్మె చేయాల్సిన అవకాశం ఉంది.

అయితే ఈ నేపథ్యంలో క్యాబినెట్ నుంచి త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. రెండు గంటల పాటు జరిగిన కమిటీ సమావేశంలో పూర్తిగా చర్చలైతే ఫలించలేదు. దీంతో సమ్మె బాటకు మేము సిద్ధంగా ఉన్నామంటూ ఆర్టీసికి సంబంధించినటువంటి జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. సమావేశంలో సీనియర్ ఆఫీసర్లు డిమాండ్లకు గడువు ఇవ్వని నేపథ్యంలో ఆర్టీసీకి సంబంధించిన జేఏసీ నాయకులు వాళ్ల పూర్తి నిర్ణయాన్ని మీడియాకి చెప్పడం జరిగింది.