జగన్ నవరత్నాలలో మద్యపాన నిషేధం పై వెనక్కు తగ్గని జగన్....
posted on Oct 3, 2019 10:05AM

గ్రామ వాలంటీర్లు, సెక్రటేరియట్లు ఈ రెండూ కూడా అవినీతి, వివక్ష అన్నది ఎక్కడా కూడా చూపే పరిస్థితి కూడా లేకుండా ప్రతి పథకం తీసుకు వచ్చే కార్యక్రమన్ని ప్రారంభిస్తూన్నామని జగన్ వెల్లడించారు. అక్టోబరు నాలుగో తారీకున ప్రతి ఆటో తోలుకుంటూ ఉన్న ప్రతి ట్యాక్సీ కోరుకుంటావున్నా సొంత ట్యాక్సీ సొంత ఆటో ఉన్న ప్రతి తమ్ముడికి ప్రతి అన్నకు జగన్ తోడుగా ఉంటాడు. ప్రభుత్వం అండగా ఉంటుంది అని చెప్పి సంకేతమిస్తూ ఇచ్చిన మాట ప్రకారం నిజాయితీగా అవినీతి ఎక్కడ తావు లేకుండా ప్రతి ఒక్కరికీ అక్షరాలా లక్షా డెబ్బై రెండు వేల మందికి పది వేల రూపాయలు వారి అకౌంట్లల్లో జమ చేసే కార్యక్రమానికి శ్రీకారం జరుగుతుంది. ఒక్కసారి ఆలోచన చేయండి ఇంత గొప్ప కార్యక్రమం అవినీతికి తావు లేకుండా జరిపి చేయగలుగుతున్నామంటే గ్రామ వాలంటీర్లు, గ్రామ సెక్రటేరియట్లు వాళ్లు చేస్తున్న కృషి ఎంత ఉంది అన్నది ఆలోచించాలని జగన్ కోరారు.ఈ వ్యవస్థలోకి సంపూర్ణమైన మార్పులు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తామన్నారు. గాంధీ జయంతి నాడు మద్యం మీద జరుగుతవున్న మనం పోరాటం కూడా ఆయన ప్రస్తావించారు. మద్యం షాపులు ఇంతకు ముందు ఎన్నున్నాయో అందరికీ తెలుసు అక్షరాల మద్యం దుకాణాలు అప్పట్లో నాలుగు వేల ఐదు వందల ఎనభై షాపులున్నాయి. మద్యం షాపులకు అనుసంధానంగా ప్రతి గ్రామంలోను బెల్టుషాపులు అక్షరాల రాష్ట్రంలో నలభై మూడు వేల బెల్టుషాపులున్న పరిస్థితి గతంలో కనిపించేది.
ఊర్లల్లో మినరల్ వాటర్ ఉందో లేదో తెలీదు కానీ మద్యం దుకాణాల మాత్రం వీధి చివరన గుడి పక్కన బడి పక్కన ఎక్కడ పడితే అక్కడ కనిపించే పరిస్థితి మాత్రం గ్రామాల్లో ఉండేది." ఈ రోజు సగర్వంగా నేను చెబుతా ఉన్నా గాంధీ జయంతి నాడు గాంధీ గారి స్ఫూర్తిని తీసుకొని ఈ రోజు చెబుతా ఉన్నాను. ఇవాళ గర్వంగా చెబుతారాయన నలభై మూడు వేల బెల్టు షాపులు ఏ గ్రామంలోను బెల్టు షాపులు లేకుండా పూర్తిగా రద్దు చేసిన ప్రభుత్వం వైసీపీది" అని చెప్పి సగర్వంగా జగన్ తెలియజేశారు. ఈ బెల్టు షాపులు రద్దు చేయడమే కాదు పూర్తిగా లేకుండా చేయడమే కాదు మళ్లీ ఈ బెల్టు షాపులు పుట్టుకు రాకుండా చేయడం కోసం ప్రభుత్వమే బెల్టు షాపులనేదే లేకుండా చేయడం కోసం ప్రభుత్వమే మద్యం దుకాణాలు కూడా నేరుగా ప్రభుత్వమే నడిపించే కార్యక్రమం చేస్తామని జగన్ వెల్లడించారు.
ప్రైవేటు షాపులు నడిపితే ప్రైవేటు వాళ్ళు లాభాపేక్షతో బెల్టు షాపులు ప్రోత్సహిస్తారు. ఆ ప్రోత్సాహం ఉండకుండా ఉండాలంటే గవర్నమెంటే బెల్టు షాపులు నడిపితేనే ఇది సాధ్యమవుతుంది అని తెలిసి పూర్తిగా ప్రైవేటు షాపులను తీసేసి గవర్నమెంటే మధ్య షాపులు నడిపించే కార్యక్రమం కూడా చెయ్యటానికి శ్రీకారం చుట్టింది. నాలుగు వేల ఐదు వందల ఎనభై మందు షాపులు గతంలో ఉంటే ఈ రోజు మూడు వేల నాలుగు వందల యాభై షాపులకు దానిని తగ్గించారని తన నవరత్నాల పధకం అమలు గురించి ఆయన వ్యాఖ్యానించారు.
పర్మిట్ రూములు అన్నది ఇంతకు ముందు మందు షాపు మంజుషా పక్కనే ఒక పర్మిట్ రూమ్ ఆ పర్మిట్ రూం పక్కనే అక్కడే తాగుబోతులు తాగుతా ఉన్నప్పుడు ఆడ వాళ్లు ఎవరైనా కూడా అక్కచెల్లెమ్మల ఎవరైనా కూడా దారిన పోవాలంటే భయపడే పరిస్థితి. ఆ పరిస్థితులను కూడా మార్చేసి గవర్నమెంటే షాపును నడుపుతోంది పక్కనే పర్మిట్ రూములు కూడా పూర్తిగా రద్దు చేసే కార్యక్రమాన్ని చేస్తున్నామని జగన్ తెలియజేశారు.
మద్యం టైం పై కూడా ఆయన ప్రస్తావిస్తూ ఇంతకు ముందు రాత్రి పదైనా రాత్రి పదకొండయినా మందు అందుబాటులో ఉండే పరిస్థితి పూర్తిగా తీసేసి మంత్రి షాపు తెరవడమే మధ్యాహ్నం దిశగా పదకొండు గంటలకు తెరిచి రాత్రి ఎనిమిది అయ్యేసరికి మందు షాపులను కూడా పూర్తిగా మూసేయాలి అని చెప్పి ఆదేశాలు జారీచేశామని ఆయన వెల్లడించారు.మద్యం నిషేధం పై జగన్ చాలా గట్టి నిర్ణయంతోనే ఉన్నారని మనకు వెల్లడవుతోంది.