బీహార్ ఎన్నికలు.. నేతల మాటల తూటాలు.. ఈసీ నోటీసులు
posted on Nov 2, 2015 11:07AM
సాధారణంగా ఎన్నికల ప్రచారంలో ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం మామూలే కానీ.. ఇప్పుడు బీహార్ ఎన్నికల నేపథ్యంలో నేతల మధ్య మాటల తూటాలు ఒక రేంజ్ లో పేలుతున్నాయి. ఒకరి మీద ఒకరు వివాదాస్పదమైన వ్యక్తికత దూషణలు చేసుకుంటున్నారు. మహాకూటమికి, బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ బీహార్ ఎన్నికల నేపథ్యంలో పార్టీల నేతలు ఒకరి మీద ఒకరు విరుచుకుపడుతన్నారు. దీంతో తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగాను లాలు, అమిత్ షా, రాహుల్ గాంధీకి ఈసీ నోటీలుసు జారీ చేసింది. నవంబర్ 4వ తేదీ లోపు వివరణ ఇవ్వాలని కోరింది. కాగా లాలు, అమిత్ షాను నరభక్షకుడు అని కామెంట్ చేయగా.. హిందూ ముస్లింల మధ్య మత విభేధాలు రగల్చడమే బీజేపీ లక్ష్యం అని రాహుల్ వ్యాఖ్యానించారు. ఇంక బీజేపీ ఓడిపోతే పాక్ లో సంబరాలు జరుపుకుంటారు అని అమిత్ షా అన్నారు. వీరు చేసిన వ్యాఖ్యలకు గాను ఈసీ నోటీసులు జారీ చేసింది.