రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్.. విజయ్ పాల్ కు సుప్రీంలో చుక్కెదురు

నరసాపురం మాజీ ఎంపీ, ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఏపీ సీఐడీ మాజీ అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్ కు చుక్కెదురైంది. ఈ కేసులో ముందస్తు బెయిలు కోసం విజయ్ పాల్ దాఖలు చేసుకున్న పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. గతంలో ఆయన ఇదే విషయమై హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు కూడా విజయ్ పాల్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ విజయ్ పాల్ సుప్రీంను ఆశ్రయించారు. ఇప్పుడు సుప్రీంలో కూడా ఆయనకు చుక్కెదురైంది. 

సీఐడీ కస్టడీలో తనపై ధర్డ్ డిగ్రీ ప్రయోగించిన అధికారులపై కేసు నమోదు చేయాలంటూ రఘురామకృష్ణం రాజు ఇచ్చిన ఫిర్యాదు చేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.    ఈ కేసులో ముందస్తు బెయిలు కోసం విజయ్ పాల్ గత నెలలలో హైకోర్టును, ఆ తరువాత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. రెండు కోర్టులలోనూ ఆయనకు చుక్కెదురవ్వడంతో ఆయన అరెస్టు అనివార్యం అని చెప్పవచ్చు.