పళనిస్వామికి సర్కార్ కు సుప్రీం షాక్....
posted on Jul 5, 2017 12:55PM
(1).jpg)
మొత్తానికి తమిళనాడు రాజకీయాల్లో మాత్రం రోజుకో ట్విస్ట్ వచ్చి పడుతుంది. ఇప్పటికే ఎన్నో ట్విస్ట్ లు, మలుపు చోటుచేసుకుంటుంగా ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం తమిళనాడు రాజకీయాల్లో స్తబ్దత నెలకొంది. ఇక ఒకపార్టీగా ఉన్న అన్నాడీఎంకే రెండు వర్గాలుగా విడిపోయింది. దీంతో అసెంబ్లీలో బలపరీక్ష చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో నెగ్గిన శశికళ వర్గం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే విశ్వాస పరీక్షలో నెగ్గేందుకుగాను ఎమ్మెల్యేలకు ముడుపులు చెల్లించారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం ఓ స్టింగ్ ఆపరేషన్ లో కూడా బయటపడింది. దీంతో దీనిపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇక ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు... అసెంబ్లీలో అవిశ్వాస పరీక్ష జరిగిన తీరును పరిశీలించేందుకు అనుమతినిచ్చింది.