దిగొచ్చిన కేంద్రం... పాత నోట్ల మార్పిడికి మరో ఛాన్స్...
posted on Jul 5, 2017 12:24PM

నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు కేంద్రానికి మొట్టికాయలు వేసిన సంగతి తెలిసిందే. పాత నోట్లు మార్చుకోవడానికి మరో అవకాశం కల్పించాలని కోరుతూ కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు.. రద్దైన నోట్లను మార్చుకోవడానికి మార్చి 31 వరకే గడువు ఎందుకు ఇచ్చారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నిజాయతీ గల పౌరులను ఇబ్బందులకు గురి చేయడం తగదని, మరోసారి గడువు ఇచ్చే అంశంపై రెండు వారాల్లోగా బదులివ్వాలని ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించింది. ఇక సుప్రీం చేసిన ఆదేశాలకు స్పందించిన కేంద్రం మరోసారి నోట్లను మార్చుకునేందుకు అవకాశం ఇవ్వనుంది. మరో రెండు వారాల్లో అన్ని బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా పాత నోట్లను మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తూ, కేంద్రం ఆదేశాలు జారీ చేయనున్నట్టు తెలుస్తోంది.