మోడీ మరో ఘనత...ఇజ్రాయెల్‌ పువ్వుకి మోడీ పేరు...

 

ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయిల్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఏ ప్రధాని ఇజ్రాయిల్ పర్యటన చేయడానికి ధైర్యం చేయని నేపథ్యంలో మోడీ ఈ పర్యటన చేసి... ఆ దేశాన్ని సందర్శించిన తొలి ప్రధానిగా చరిత్ర సృష్టించారు. అయితే ఇప్పుడు మరో ఘనత సాధించారు మోడీ. మోదీ..  ఆ దేశ ప్రధాని బెంజమిన్‌ నేతన్యాహుతో కలిసి ‘డాంజిగర్‌’ పూలతోటను సందర్శించారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్‌ దేశానికి చెందిన ఓ పువ్వుకి భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరు పెట్టారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్‌ ప్రభుత్వం అధికారిక ట్విటర్‌ ద్వారా వెల్లడించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu