దర్శన్ కి మద్దతుగా రంగంలోకి సుమలత 

సుమలత(sumalatha)తెలుగు సినిమా రంగంలో తన దైన ముద్ర వేసుకున్న నటి.  ఖైదీ, జీవన రాగం, శృతి లయలు, స్వయం కృషి శుభలేఖ, ఆలయ  శిఖరం, పసివాడి ప్రాణం, దొంగ పెళ్లి, ఇద్దరు మిత్రులు, వేట, జీవన రాగం,  ఇలా సుమారు 60 కి పైగా చిత్రాల్లో చేసింది. హీరోయిన్ గాను, క్యారక్టర్ ఆర్టిస్ట్ గాను తన సత్తా చాటింది. కన్నడ,తమిళ, మలయాళ భాషల్లో కూడా  వంద కి పైగా చిత్రాల్లో చేసింది. దీన్ని బట్టి ఆమె స్టామినా ని అర్ధం చేసుకోవచ్చు. తాజాగా ప్రముఖ కన్నడ హీరో దర్శన్ కి సపోర్ట్ గా మాట్లాడటం టాక్ అఫ్ ది డే గా నిలిచింది.

రేణుక స్వామి హత్య కేసులో దర్శన్(darshan)అరెస్ట్ అయ్యి ప్రస్తుతం జైల్లో ఉన్న విషయం అందరకి తెలిసిందే.అన్యాయంగా ఒక మనిషిని పొట్టన పెట్టుకొని అతని కుటుంబాన్ని రోడ్ పాలు చేసిన దర్శన్ ని కఠినంగా శిక్షించాలని పలువురు కోరుతున్నారు. అదే సమయంలో  దర్శన్ ఆ హత్య చేయించి ఉండడనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో సుమలత కూడా చేరింది. తన ఇనిస్టాగ్రమ్ వేదికగా కొన్ని మాటలని పంచుకుంది. గత ఐదు సంవత్సరాల నుంచి ఎంపీగా, అంతకు ముందు నలభై నాలుగేళ్లు నటిగా ఉన్నాను. రెండూ కూడా ప్రజా జీవితానికి సంబంధించినవే. కాబట్టి ఒక బాద్యతాయుతమైన వ్యక్తిగా ఎలాంటి వాస్తవాలు లేకుండా బాధ్యతాయిత రహిత ప్రకటనలని చెయ్యలేను.ఈ రోజు అభిమానులతో కొన్ని విషయాలు పంచుకోవాలి..ముందుగా రేణుక స్వామి తల్లికి ,భార్యకి నా సానుభూతిని తెలియచేస్తున్నాను. ఆ విషాదాన్ని ఎదుర్కునే  శక్తీ ని  ఆ దేవుడు వాళ్ళకి  ప్రసాదించాలి  ఇక దర్శన్ సూపర్ స్టార్ కాకముందు నుంచి నాకు తెలుసు. నా కుటుంబంలో సభ్యుడు లాంటి వాడు. నా పెద్ద కొడుకు అని  చెప్పవచ్చు. దర్శన్ కూడా నన్ను తల్లిగా, అంబరీష్(ambareesh)ని తండ్రిగా భావిస్తాడు.ఏ తల్లి కూడా తన బిడ్డని అలాంటి పరిస్థితుల్లో చూసి తట్టుకోలేదు. ఒక్కటి మాత్రం నిజం దర్శన్ ఎదుటి వారి పట్ల  చాలా ప్రేమతో పాటు ఉదార స్వభావాన్ని కలిగి ఉంటాడు.

హత్య చేయించే వ్యక్తిత్వం దర్శన్ ది కాదు. కాకపోతే కేసు కోర్టులో ఉంది కాబట్టి ఇంతకు మించి వ్యాఖ్యలు చెయ్యను. కానీ  కొంత మంది దర్శన్ భార్య పిల్లలని టార్గెట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళందరు దర్శన్ దోషి అని ఇంకా రుజువు కాలేదనే విషయాన్ని  గుర్తుపెట్టుకోవాలి.  త్వరలోనే అసలు నిజాలు బయటకి వచ్చి దర్శన్ నిర్దోషి అని కూడా  తెలుస్తుంది. ఆ తర్వాత ఎప్పటి లాగానే సినిమాలు కూడా చేస్తాడు. అప్పటి వరకు అభిమానులు  ఎలాంటి తొందర పాటు ప్రకటనలు చేయవద్దు. భగవంతుని పై విశ్వాసం కలిగి ఉండండి. సత్యమేవ జయతే అంటు ముగించింది.