శశిమధనం వెబ్ సిరీస్ రివ్యూ

 


వెబ్ సిరీస్ : శశిమధనం
నటీనటులు: సోనియా సింగ్, పవన్ సిద్ధు, కిరీటీ, రూపా లక్ష్మీ, కృతిక, అశోక్ చంద్ర, కేశవ్ దీపక్ తదితరులు
ఎడిటింగ్: అనిల్ కుమార్. పి
మ్యూజిక్: సింజిత్ ఎర్రమిల్లి
సినిమాటోగ్రఫీ: రెహన్ షేక్
నిర్మాత : హరీశ్ కోహిర్కర్
కథ , దర్శకత్వం: వినోద్ గాలి
ఓటీటీ: ఈటీవీ విన్

కథ:

మధు(పవన్ సిద్ధు) చూడటానికి రాముడిలా ఉన్నా చేసే పనులన్నీ కృష్ణుడిలా ఉంటాయి. మధు డబ్బు సంపాదించాలని పేకాట ఆడటం, బెట్టింగులు పెట్టడం చేస్తుంటాడు. అలా బెట్టింగ్ భాస్కర్ కు మధు అప్పు పడతాడు. అప్పు సొమ్ము కోసం భాస్కర్ ఏదైనా చేసే రకమని ముందుగానే తన అన్న బండిని భాస్కర్ దగ్గర పెట్టేస్తాడు. డబ్బులిచ్చి ఆ బండి తీసుకెళ్తాను అంటూ చెప్పుకొస్తాడు. అతని నుంచి తప్పించుకునేందుకు కొన్నిరోజులు ఎక్కడైనా వెళ్దామని అనుకుంటాడు మధు. అయితే అదే సమయంలో మధు ప్రేమిస్తున్న శశి(సోనియా సింగ్) కాల్ చేసి మా వాళ్ళంతా పది రోజులు పెళ్ళి కోసమని ఊరెళ్తున్నారని చెప్తుంది. దాంతో శశి వాళ్ళ ఇంటికి వెళ్తాడు మధు. కాని కొంతసమయానికి పెళ్లి క్యాన్సిల్ అయ్యిందని తిరిగి వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వచ్చేస్తారు. అలా ఇంటికి వచ్చిన శశి కుటుంబ సభ్యులకు తెలియకుండా మధుని శశి ఎలా దాచింది? ఇంట్లో ఎవరి కంట పడకుండా దాచడం సాధ్యమేనా? మదన్ అప్పు తిరిగి కట్టాడా లేదా అనేది మిగతా కథ.


విశ్లేషణ:

సోనియా సింగ్, పవన్ సిద్ధులది రియల్ జోడి. సోషల్ మీడియాలో వీరికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఈ రియల్ జోడీ ఆన్ స్క్రీన్ పై కూడా సక్సెస్ అయ్యారా అంటే అవుననే చెప్పాలి. ఆకతాయి కుర్రాడు, అల్లరి అమ్మాయిలాగా సాగే కథనం బాగుంది. మొదటి ఎపిసోడ్ చివరలో వచ్చే ట్విస్ట్ రెండవ ఎపిసోడ్ పై ఆసక్తిని పెంచుతుంది.

దర్శకుడు కథ రాసుకున్న తీరు, హ్యాండిల్ చేసిన విధానం మెప్పిస్తుంది. అయితే కథలోకి వెళ్లేందుకు తొలి ఎపిసోడ్లో కాస్త ఎక్కువ సమయం తీసుకున్నట్లు అనిపించింది. అక్కడ కాస్త ల్యాగ్ ఫీలవుతారు. అయితే ఎవరి కంట పడకుండా ప్రియుడిని దాచిన తీరు నవ్వించడమే కాకుండా.. మెప్పిస్తుంది కూడా. హీరో- హీరోయిన్ మధ్య రొమ్యాన్స్ మాత్రమే కాదు.. కామెడీ టైమింగ్ కూడా ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. అయితే ఇంకాస్త కామెడీ టచ్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. కథ పరంగా కాస్త రొటీన్ గా ఉంది అనే భావన మైండ్ లో తిరుగుతూనే ఉంటుంది.

రెండు మూడు ఎపిసోడ్ లో వచ్చే కామెడీ సీన్స్ కొన్ని బాగున్నప్పటికి, కొన్ని మాత్రం కావాలని చేసినట్లుగా నవ్వడానికి ఇబ్బందిగా ఉంటాయి. హీరో , హీరోయిన్ల మధ్య రొమాన్స్, లవ్ ట్రాక్బలో ఫ్రెష్ ఫీల్ ఉన్నప్పటికి దర్శకుడు దానిని ఎక్కువ సేపు వాడుకోలేకపోయాడు. కథలో మిగతా  క్యారెక్టర్స్ చేసేది కాస్త ల్యాగ్ అనిపిస్తుంది. 

మొత్తం ఆరు ఎపిసోడ్‌లు ఉన్న ఈ సిరీస్ .. ఒక్కో ఎపిసోడ్ ఇరవై అయిదు నిమిషాల పైనే ఉన్నాయి. ఫ్యామిలీతో కలిసి చూసేలా ఉన్నప్పటికి అక్కడక్కడ వచ్చే రొమాంటిక్ సీన్స్ ఇబ్బందిగా ఉంటాయి. అసభ్య పదజాలం ఎక్కడ వాడలేదు. ఎడిటింగ్ బాగుంది. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. మ్యూజిక్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.


నటీనటుల పనితీరు:

శశి పాత్రలో సోనియా సింగ్, మధు పాత్రలో పవన్ సిద్ధు ఈ సిరీస్ కి ప్రధాన బలంగా నిలిచారు. ఇక మిగతావారు వారి పాత్రలకి పూర్తి న్యాయం చేశారు.

ఫైనల్ గా : అక్కడ్కడ స్లోగా సాగే ఈ సిరీస్ వన్ టైమ్ వాచెబుల్.

రేటింగ్: 2.75 / 5 

✍️. దాసరి  మల్లేశ్