ఒక్కొక్కరి కుటుంబానికి 38 లక్షలు..
posted on Dec 2, 2014 5:15PM
ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా ప్రాంతంలో సోమవారం జరిగిన మావోయిస్టుల దాడిలో 14 మంది సీఆర్‌పిఎఫ్ జవాన్లు మరణించిన విషయం తెలిసిందే. ఈ సంఘటనను కేంద్ర ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణించింది. కేంద్ర హోం శాఖ మంత్రి మంగళవారం నాడు ఈ ఘటన జరిగిన ప్రాంతానికి వచ్చి సీఆర్‌పిఎఫ్‌లో మనో ధైర్యాన్ని పెంచే ప్రయత్నం చేశారు. ఇదిలా వుండగా ఈ ఘటనలో మరణించిన సీఆర్‌పిఎఫ్ జవాన్ల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం భారీగా పరిహారాన్ని ప్రకటించింది. ఒక్కో జవాను కుటుంబానికి 38 లక్షల రూపాయలను పరిహారంగా అందిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. మావోయిస్టుల ఈ మారణకాండ ఒక పిరికిపంద చర్యగా కేంద్ర హోం మంత్రి అభివర్ణించారు. ఈ ఘటనలో గాయపడిన జవాన్లకు 65 వేల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందిస్తారు.